Yitti simgaaramu gala yimti neegu devulaaya

యిట్టి సింగారము గల యింతి నీకు దేవులాయ
Language

(॥పల్లవి॥)
యిట్టి సింగారము గల యింతి నీకు దేవులాయ
నెట్టిన నాపె కోరిక నెరవేర్చవయ్యా

(॥॥)
జలజాక్షి నెమ్మోము చంద్రుఁడని చెప్పవచ్చు
కళలు చెప్పే మంటే నలవి గాదు
అళులఁ బోలుచవచ్చు నాపె నెరిఁగురులను
పొలసి యామె మెఱుఁగులు పోలించి చెప్పరాదు

(॥॥)
వనిత కన్నులు కలువల సరి చెప్పవచ్చు
వొనర నందలి తేట లూహింపరాదు
గొన కొన్న చన్నులతో కుండ లీడు వెట్టవచ్చు
నునువట్రువలు చెప్పెమనుకొనరాదు

(॥॥)
భామ పిఱుఁదు మరుని బండి కండ్లనవచ్చు
కోమలము చెప్పే మనఁ గొలఁదిరాదు
యీ మేర శ్రీ వేంకటేశ యీకె నేలితివి పాదా
లోముచుఁ దామర లౌను వొప్పిద మెంచరాదు

(||pallavi||)
yiṭṭi siṁgāramu gala yiṁti nīgu devulāya
nĕṭṭina nābĕ koriga nĕraversavayyā

(||||)
jalajākṣhi nĕmmomu saṁdrum̐ḍani sĕppavachchu
kaḽalu sĕppe maṁṭe nalavi gādu
aḽulam̐ bolusavachchu nābĕ nĕrim̐gurulanu
pŏlasi yāmĕ mĕṟum̐gulu poliṁchi sĕpparādu

(||||)
vanida kannulu kaluvala sari sĕppavachchu
vŏnara naṁdali teḍa lūhiṁparādu
gŏna kŏnna sannulado kuṁḍa līḍu vĕṭṭavachchu
nunuvaṭruvalu sĕppĕmanugŏnarādu

(||||)
bhāma piṟum̐du maruni baṁḍi kaṁḍlanavachchu
komalamu sĕppe manam̐ gŏlam̐dirādu
yī mera śhrī veṁkaḍeśha yīgĕ nelidivi pādā
lomusum̐ dāmara launu vŏppida mĕṁcharādu