Yitti bhaagyamu gamtimi yiddaroo badugarayya

యిట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకరయ్య
Language

(॥పల్లవి॥)
యిట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకరయ్య
పట్టము గట్టుకొంటివి పచ్చి దేరెనయ్యా

(॥॥)
చెలియ తోడే నీకు సింహాసనపు గద్దె
అలరుఁ జూపులే రత్నాభిషేకము
చలువైన నవ్వులే ఛత్రచామరములు
కలిగె నీ కింక నేమి గావలె నయ్యా

(॥॥)
చనుఁగవలే నీకు సామ్రాజ్యదుర్గములు
నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు
వొనరిన కౌఁగిలే వుండెడి నీ నగరు
యెనయ నబ్బె నీ భాగ్య మీడేరె నయ్యా

(॥॥)
రతిచెనకులే నీకు రవణపు సొమ్ములు
సతతపు గూటమే సర్వ సంపద
యితవై శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
సత మాయ మమ్ము నేలి జాణ వైతివయ్యా

(||pallavi||)
yiṭṭi bhāgyamu gaṁṭimi yiddarū badugarayya
paṭṭamu gaṭṭugŏṁṭivi pachchi derĕnayyā

(||||)
sĕliya toḍe nīgu siṁhāsanabu gaddĕ
alarum̐ jūbule ratnābhiṣhegamu
saluvaina navvule shatrasāmaramulu
kaligĕ nī kiṁka nemi gāvalĕ nayyā

(||||)
sanum̐gavale nīgu sāmrājyadurgamulu
ninubu movidenĕlu nichchabonālu
vŏnarina kaum̐gile vuṁḍĕḍi nī nagaru
yĕnaya nabbĕ nī bhāgya mīḍerĕ nayyā

(||||)
radisĕnagule nīgu ravaṇabu sŏmmulu
sadatabu gūḍame sarva saṁpada
yidavai śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sada māya mammu neli jāṇa vaidivayyā