యిరుమొన సూది యాయ నిదివో నీ మోహము
(॥పల్లవి॥)
యిరుమొన సూది యాయ నిదివో నీ మోహము
విరు లాపె వేసినవి వెస నాపై వేసేవు
(॥॥)
కానుక యిచ్చి ఆపె కాచుక నీ కుండఁగాను
వూనుకొని నాతో నెంత పొందు సేసేవు
వీనులలోని కప్పటి విన్నపాలూఁ జేయఁగాను
మానక నా మోము చూచి మాట లాడేవు
(॥॥)
చేరి చేరి యాపె నిన్నుఁ జెరఁగువట్టుకుండఁ గా
నారు కొన నాతో నీవు నవ్వు నవ్వేవు
కూరిమి గొసరి మరీఁ గొప్పు నీకు ముడువఁగా
నేరుపున నా మీఁద నెయ్యము చల్లేవూ
(॥॥)
వేడుకతో నాపె నిన్ను వెసఁ గౌఁగిలించఁగాను
యీడ నాకు మోవితేనె లియ్య వచ్చేవు
జాడతో శ్రీ వేంకటేశ సరిగా మమ్మిద్దరినిఁ
గూడి మాలో మాకు నను గుణము సేసేవూ
(||pallavi||)
yirumŏna sūdi yāya nidivo nī mohamu
viru lābĕ vesinavi vĕsa nābai vesevu
(||||)
kānuga yichchi ābĕ kāsuga nī kuṁḍam̐gānu
vūnugŏni nādo nĕṁta pŏṁdu sesevu
vīnulaloni kappaḍi vinnabālūm̐ jeyam̐gānu
mānaga nā momu sūsi māḍa lāḍevu
(||||)
seri seri yābĕ ninnum̐ jĕram̐guvaṭṭuguṁḍam̐ gā
nāru kŏna nādo nīvu navvu navvevu
kūrimi gŏsari marīm̐ gŏppu nīgu muḍuvam̐gā
nerubuna nā mīm̐da nĕyyamu sallevū
(||||)
veḍugado nābĕ ninnu vĕsam̐ gaum̐giliṁcham̐gānu
yīḍa nāgu movidenĕ liyya vachchevu
jāḍado śhrī veṁkaḍeśha sarigā mammiddarinim̐
gūḍi mālo māgu nanu guṇamu sesevū