Yippudu vachchidivi maa yimtigi neevu

యిప్పుడు వచ్చితివి మా యింటికి నీవు
Language

(॥పల్లవి॥)
యిప్పుడు వచ్చితివి మా యింటికి నీవు
దప్పి దేరె నా పయి దయ దలఁచఁగ వలదా

(॥॥)
తలపోఁ తలనుఁ జిక్కి తగ వెదకుదు నిన్ను
లలి నిన్నుఁ జూచేనంటా లాచి కోరుదునూ
అలమె నంటా లోలో నాసలఁ బొరలుదును
యెలమి నీ వయితేను యెక్కడ నుందువయ్యా

(॥॥)
మంతనాన నుండి తమకింతు నీ రాకకు
బంతికూటివేళ నీకు వార మిత్తును
కాంతల నీ వద్ది కంపి కాచు కుండుదు వేళలు
యింత నే మోహించితి నీ వెక్కడ నుందువయ్యా

(॥॥)
సరసము లాడే నంటా సారెకు వేడుక సేతు
సరుగ నీ రతు లెంచి సంతోసింతును
యిరవై శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి
యెరవు లే దిద్దరికి నెక్కడ నుందువయ్యా

(||pallavi||)
yippuḍu vachchidivi mā yiṁṭigi nīvu
dappi derĕ nā payi daya dalam̐sam̐ga valadā

(||||)
talabom̐ talanum̐ jikki taga vĕdagudu ninnu
lali ninnum̐ jūsenaṁṭā lāsi korudunū
alamĕ naṁṭā lolo nāsalam̐ bŏraludunu
yĕlami nī vayidenu yĕkkaḍa nuṁduvayyā

(||||)
maṁtanāna nuṁḍi tamagiṁtu nī rāgagu
baṁtigūḍiveḽa nīgu vāra mittunu
kāṁtala nī vaddi kaṁpi kāsu kuṁḍudu veḽalu
yiṁta ne mohiṁchidi nī vĕkkaḍa nuṁduvayyā

(||||)
sarasamu lāḍe naṁṭā sārĕgu veḍuga sedu
saruga nī radu lĕṁchi saṁtosiṁtunu
yiravai śhrī veṁkaḍeśha yiṁtalo nannelidivi
yĕravu le diddarigi nĕkkaḍa nuṁduvayyā