యిప్పు డొక్కటైతిరా యిద్దరు మీరు
(॥పల్లవి॥)
యిప్పు డొక్కటైతిరా యిద్దరు మీరు
అప్పసము గోర నొత్తెనని యంటి వపుడూ
(॥॥)
చెక్కు నొక్కి నీతోను చెలియ విన్నవించీని
యిక్కువతో వింటివా యిన్నియు నీవు
లక్కవంటి నీ మనసు లలిఁ గరఁ గెనా నేఁ డు
అక్కరతోఁ దిట్టే నంటా నంటివి నీ వాపెను
(॥॥)
చెమ్మఁ జెమట దుడిచి చేరి నిన్ను వేఁడుకొని
సమ్మతేయనా నీకు సతి ప్రియాలు
వుమ్మడి సంతోసములోనఁ గూడెనా మఱి
బొమ్మల జంకించె నంటాఁ బొరలితి వచటా
(॥॥)
అటమేలుమంగ నిన్ను నదివో కౌఁగిలించీని
చెలఁగి కూడితివా శ్రీ వేంకటేశ
తలపోఁత లిద్దరికీ తారుకాణ లాయనా
కిల కిల నవ్వేనంటాఁ గెరలుతా నుంటివి
(||pallavi||)
yippu ḍŏkkaḍaidirā yiddaru mīru
appasamu gora nŏttĕnani yaṁṭi vabuḍū
(||||)
sĕkku nŏkki nīdonu sĕliya vinnaviṁchīni
yikkuvado viṁṭivā yinniyu nīvu
lakkavaṁṭi nī manasu lalim̐ garam̐ gĕnā nem̐ ḍu
akkaradom̐ diṭṭe naṁṭā naṁṭivi nī vābĕnu
(||||)
sĕmmam̐ jĕmaḍa duḍisi seri ninnu vem̐ḍugŏni
sammadeyanā nīgu sadi priyālu
vummaḍi saṁtosamulonam̐ gūḍĕnā maṟi
bŏmmala jaṁkiṁchĕ naṁṭām̐ bŏralidi vasaḍā
(||||)
aḍamelumaṁga ninnu nadivo kaum̐giliṁchīni
sĕlam̐gi kūḍidivā śhrī veṁkaḍeśha
talabom̐ta liddarigī tārugāṇa lāyanā
kila kila navvenaṁṭām̐ gĕraludā nuṁṭivi