Yippa de vichchesidi vimka nelaa

యిప్ప డే విచ్చేసితి విఁక నేలా
Language

(॥పల్లవి॥)
యిప్ప డే విచ్చేసితి విఁక నేలా
అప్పటప్పటి యాసల నలసె నా మనసూ

(॥॥)
పిలిపించే వనీ యట్టే ప్రేమతోఁ గాచు కుండితి
చెలుల నంపే వంటాఁ జెంగలించితి
అలరి నీవే వచ్చే వంటా నెదురుచూచితి
వెలలేని వేడుకల వేగెఁ బొద్దు నాకును

(॥॥)
యింటిలో నున్నాఁడ వంటా నింతటాను వెదకితి
కంటి నంటా నీడ చూచి గడె వెట్టితి
అంటఁ బారి పట్టఁబోయి ఆయములు మరచితి
వెంటనే నా భ్రమ తల వేగెఁ బొద్దు నాకును

(॥॥)
సారె సారె నిన్నుఁ బాడి జాగరాలు చేసితిని
నీ రూపు దలపోసి నివ్వెరగైతి
యీ రీతి శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
వే రతికేలి మన్నన వేగె బొద్దు నాకును.

(||pallavi||)
yippa ḍe vichchesidi vim̐ka nelā
appaḍappaḍi yāsala nalasĕ nā manasū

(||||)
pilibiṁche vanī yaṭṭe premadom̐ gāsu kuṁḍidi
sĕlula naṁpe vaṁṭām̐ jĕṁgaliṁchidi
alari nīve vachche vaṁṭā nĕdurusūsidi
vĕlaleni veḍugala vegĕm̐ bŏddu nāgunu

(||||)
yiṁṭilo nunnām̐ḍa vaṁṭā niṁtaḍānu vĕdagidi
kaṁṭi naṁṭā nīḍa sūsi gaḍĕ vĕṭṭidi
aṁṭam̐ bāri paṭṭam̐boyi āyamulu marasidi
vĕṁṭane nā bhrama tala vegĕm̐ bŏddu nāgunu

(||||)
sārĕ sārĕ ninnum̐ bāḍi jāgarālu sesidini
nī rūbu dalabosi nivvĕragaidi
yī rīdi śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
ve radigeli mannana vegĕ bŏddu nāgunu.