యిన్నిటా మన్నించితివి యీ మే లెఱుఁగు నింతి
(॥పల్లవి॥)
యిన్నిటా మన్నించితివి యీ మే లెఱుఁగు నింతి
విన్నదాఁకా సుద్దులకు వేడుక సేసీని
(॥॥)
చిత్తమునఁ బట్టె నా చేసిన విన్నపములు
బత్తి నీపైఁ జేసినది భావించితినా
మత్తిలి నీ దేవులకు మారుమాట లేమంటివి
యిత్తల నాకె నీ రాక కెదురుచూచీని
(॥॥)
కంటి వాని కంపిన కానిక లెల్లాఁ గన్నుల
ఇంటికి రమ్మన్నందుకు నియ్యకొంటివా
అంటిన నీ తలఁ పు లేమని వక్కణింతు నేను
నంటున నీ కూటమికి నమ్మి కాచుకున్నది
(॥॥)
అవధరించితివా ఆదివో అలమేల్మంగ
జవళి శ్రీ వేంకటేశ సతమైతివా
భువి నిట్టె సంతతము పొసఁగఁగ మన్నించేవా
వివరించు దాఁ కా నన్ను వెసఁ జూచుకున్నది.
(||pallavi||)
yinniḍā manniṁchidivi yī me lĕṟum̐gu niṁti
vinnadām̐kā suddulagu veḍuga sesīni
(||||)
sittamunam̐ baṭṭĕ nā sesina vinnabamulu
batti nībaim̐ jesinadi bhāviṁchidinā
mattili nī devulagu mārumāḍa lemaṁṭivi
yittala nāgĕ nī rāga kĕdurusūsīni
(||||)
kaṁṭi vāni kaṁpina kāniga lĕllām̐ gannula
iṁṭigi rammannaṁdugu niyyagŏṁṭivā
aṁṭina nī talam̐ pu lemani vakkaṇiṁtu nenu
naṁṭuna nī kūḍamigi nammi kāsugunnadi
(||||)
avadhariṁchidivā ādivo alamelmaṁga
javaḽi śhrī veṁkaḍeśha sadamaidivā
bhuvi niṭṭĕ saṁtadamu pŏsam̐gam̐ga manniṁchevā
vivariṁchu dām̐ kā nannu vĕsam̐ jūsugunnadi.