Yinni vinnabamulunu yimdulone vunnavi

యిన్ని విన్నపములును యిందులోనే వున్నవి
Language

(॥పల్లవి॥)
యిన్ని విన్నపములును యిందులోనే వున్నవి
పన్ని నన్ను నేలే నిఁక బతికితి ననవే

(॥॥)
యెనసిన మీఁద నేలే యెరవులూ
ననిచిన మీఁద నేలే నమ్మికలూ
తనిసిన మీఁద నేలే తమకములు
మనవి చేకొని యిఁక మఱవకు మనవే

(॥॥)
మరిగిన మీఁద నేలే మరిచింతలూ
కరఁగిన మీఁద నేలే కాంతాళింపులు
సరియైన మీఁద నేలే సాదింపులు
గరిమ నా కిచ్చె నిఁకఁ గరుణించు మనవే

(॥॥)
కలసిన మీఁద నేలే కడువాసుల
పిలిచిన మీఁద నేలే బిగువులూ
యెలమి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
తలఁ నట్టే కూడఁ దగు నింక ననవే

(||pallavi||)
yinni vinnabamulunu yiṁdulone vunnavi
panni nannu nele nim̐ka badigidi nanave

(||||)
yĕnasina mīm̐da nele yĕravulū
nanisina mīm̐da nele nammigalū
tanisina mīm̐da nele tamagamulu
manavi segŏni yim̐ka maṟavagu manave

(||||)
marigina mīm̐da nele marisiṁtalū
karam̐gina mīm̐da nele kāṁtāḽiṁpulu
sariyaina mīm̐da nele sādiṁpulu
garima nā kichchĕ nim̐kam̐ garuṇiṁchu manave

(||||)
kalasina mīm̐da nele kaḍuvāsula
pilisina mīm̐da nele biguvulū
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
talam̐ naṭṭe kūḍam̐ dagu niṁka nanave