యిన్ని నేరుపుల యాకె యీ యలమేలుమంగ
(॥పల్లవి॥)
యిన్ని నేరుపుల యాకె యీ యలమేలుమంగ
నిన్ను జట్టిగొనె నిట్టే నెగడఁగఁ దగును
(॥॥)
మక్కువ గలుగు పతి మనసు గలఁచరాదు
వక్కణతో మెప్పించ వలె గాని
వెక్కసపు మాటలు వేమారు నాడఁగరాదు
పక్కన వినయములే పచరించఁదగును
(॥॥)
బత్తి సేసి యాతనిఁ బై పై గొసరరాదు
మెత్తని మోవి యిచ్చుటే మేలుగాని
హత్తి సరసమాడఁగ నలయించఁగరాదు
గుత్తపు చన్నుల నొత్తి కూడఁగఁ దగును
(॥॥)
యేలిన శ్రీ వేంకటేశు నెలయించఁగ రాదు
చాలాఁ గౌఁగిలించుటే చందము గాని
జోలిఁ బెట్టి వూరకైనా సొరిదిఁ బెనఁగరాదు
యీ లీల వొకరొకరు యెనయుటే తగును
(||pallavi||)
yinni nerubula yāgĕ yī yalamelumaṁga
ninnu jaṭṭigŏnĕ niṭṭe nĕgaḍam̐gam̐ dagunu
(||||)
makkuva galugu padi manasu galam̐sarādu
vakkaṇado mĕppiṁcha valĕ gāni
vĕkkasabu māḍalu vemāru nāḍam̐garādu
pakkana vinayamule pasariṁcham̐dagunu
(||||)
batti sesi yādanim̐ bai pai gŏsararādu
mĕttani movi yichchuḍe melugāni
hatti sarasamāḍam̐ga nalayiṁcham̐garādu
guttabu sannula nŏtti kūḍam̐gam̐ dagunu
(||||)
yelina śhrī veṁkaḍeśhu nĕlayiṁcham̐ga rādu
sālām̐ gaum̐giliṁchuḍe saṁdamu gāni
jolim̐ bĕṭṭi vūragainā sŏridim̐ bĕnam̐garādu
yī līla vŏgarŏgaru yĕnayuḍe tagunu