Yinnaallu neṟumgamaidi middari mee pomdulu

యిన్నాళ్ళు నెఱుఁగమైతి మిద్దరి మీ పొందులు
Language

(॥పల్లవి॥)
యిన్నాళ్ళు నెఱుఁగమైతి మిద్దరి మీ పొందులు
సన్నలాను చాయలాను సరి గానుపించీని

(॥॥)
ఇచ్చిన చన వెట్టి దో యీపెకు నీవు నేఁడు
పచ్చి దేర నవ్వు నవ్వి పచారించీని
కచ్చు పెట్టేప్పట నుండి కాచుకున్నదో నీకు
యిచ్చలఁ దన తమక మిప్పుడే చూపీని

(॥॥)
పలుమారు మీలో నొడఁ బాట్లవి యెట్టి వో
మలసి యీకె నీతో మాటలాడీని
వెలలేని వలపుల వేడుక లింకా నెన్నో
కలువ పూవుల వేసి కాంతాళించీని

(॥॥)
తనివోని యాసోదము తన కెంత గద్దో కాని
చనుఁ గవఁ బెనగుతా సాము సేసీని
ననుఁ గూడితి వింతలో నమ్మించి శ్రీవేంకటేశ
నను పెంతో తాను గోరు నాఁ టించీని పైని

(||pallavi||)
yinnāḽḽu nĕṟum̐gamaidi middari mī pŏṁdulu
sannalānu sāyalānu sari gānubiṁchīni

(||||)
ichchina sana vĕṭṭi do yībĕgu nīvu nem̐ḍu
pachchi dera navvu navvi pasāriṁchīni
kachchu pĕṭṭeppaḍa nuṁḍi kāsugunnado nīgu
yichchalam̐ dana tamaga mippuḍe sūbīni

(||||)
palumāru mīlo nŏḍam̐ bāṭlavi yĕṭṭi vo
malasi yīgĕ nīdo māḍalāḍīni
vĕlaleni valabula veḍuga liṁkā nĕnno
kaluva pūvula vesi kāṁtāḽiṁchīni

(||||)
tanivoni yāsodamu tana kĕṁta gaddo kāni
sanum̐ gavam̐ bĕnagudā sāmu sesīni
nanum̐ gūḍidi viṁtalo nammiṁchi śhrīveṁkaḍeśha
nanu pĕṁto tānu goru nām̐ ṭiṁchīni paini