యింటికి విచ్చేయవయ్య యేమైనాఁ జేసేఁ గాని
(॥పల్లవి॥)
యింటికి విచ్చేయవయ్య యేమైనాఁ జేసేఁ గాని
కంటువాసి నందుమీఁద కడుఁ దడ వేఁటికీ
(॥॥)
నేర మెంచఁ బని లేదు నీకు నాకు నిఁకఁ బోదు
వారి వీరివలె బొంక వైపు గాదు
వోరి యని పిలిచితి వోపనని బిగిసితి
కోరి నీకే మొక్కితిని కోప మిఁక నేఁటికీ
(॥॥)
చలము సాదించ నేల సరుస నీకు నే నాల
యెలయించ నీవు నన్ను నిదె వేళా
తొలుత నేఁ బదరితి దొమ్మి నిన్నుఁ జేసితిని
వలచి వచ్చితి నిఁక వట్టి పగ లేఁటికీ
(॥॥)
జగడము లింత గద్దా సరి నున్నదాన నీవొద్ద
విగడా లిన్నియు నిఁ క వినవద్దా
నిగిడి శ్రీ వేంకటేశ నిన్నే నేఁ గూడితిని
తగులమయిన మీఁద తమకము లేఁటికీ.
(||pallavi||)
yiṁṭigi vichcheyavayya yemainām̐ jesem̐ gāni
kaṁṭuvāsi naṁdumīm̐da kaḍum̐ daḍa vem̐ṭigī
(||||)
nera mĕṁcham̐ bani ledu nīgu nāgu nim̐kam̐ bodu
vāri vīrivalĕ bŏṁka vaibu gādu
vori yani pilisidi vobanani bigisidi
kori nīge mŏkkidini koba mim̐ka nem̐ṭigī
(||||)
salamu sādiṁcha nela sarusa nīgu ne nāla
yĕlayiṁcha nīvu nannu nidĕ veḽā
tŏluda nem̐ badaridi dŏmmi ninnum̐ jesidini
valasi vachchidi nim̐ka vaṭṭi paga lem̐ṭigī
(||||)
jagaḍamu liṁta gaddā sari nunnadāna nīvŏdda
vigaḍā linniyu nim̐ ka vinavaddā
nigiḍi śhrī veṁkaḍeśha ninne nem̐ gūḍidini
tagulamayina mīm̐da tamagamu lem̐ṭigī.