యింతితో నలుగకు మీ యెన్నఁడూ నో రమణుఁడ
(॥పల్లవి॥)
యింతితో నలుగకు మీ యెన్నఁడూ నో రమణుఁడ
పొంత చెలులము గాన బుద్దులు చెప్పేము
(॥॥)
కలువలు వంటివే కన్ను లందురు గాని
సొలసి చూచితే నాఁటుఁ జురు కనుచు
తలిరు వంటిదే మెత్తని మో వందురు గాని
పలికితే మదనుని పట్టే మై తోఁచును
(॥॥)
జక్కవలు వంటివే చన్ను లందురు గాని
పక్కనఁ జూపితేనే భ్రమసు మతి
చక్కెర బొమ్మ వంటిది సతిమే నందురు గాని
వొక్కమాటు సోఁ కినాను చొక్కించు నీ మగుచు
(॥॥)
తమ్మి పూల వంటివి హస్తము లందురు గాని
కమ్మి కౌఁ గిలించుకొంటే కళ రేఁచును
యిమ్ముల శ్రీ వేంకటేశ యీపె నిట్టే కూడితివి
తెమ్మ లైన రతుల నీ దేవులై వుండును
(||pallavi||)
yiṁtido nalugagu mī yĕnnam̐ḍū no ramaṇum̐ḍa
pŏṁta sĕlulamu gāna buddulu sĕppemu
(||||)
kaluvalu vaṁṭive kannu laṁduru gāni
sŏlasi sūside nām̐ṭum̐ juru kanusu
taliru vaṁṭide mĕttani mo vaṁduru gāni
paligide madanuni paṭṭe mai tom̐sunu
(||||)
jakkavalu vaṁṭive sannu laṁduru gāni
pakkanam̐ jūbidene bhramasu madi
sakkĕra bŏmma vaṁṭidi sadime naṁduru gāni
vŏkkamāḍu som̐ kinānu sŏkkiṁchu nī magusu
(||||)
tammi pūla vaṁṭivi hastamu laṁduru gāni
kammi kaum̐ giliṁchugŏṁṭe kaḽa rem̐sunu
yimmula śhrī veṁkaḍeśha yībĕ niṭṭe kūḍidivi
tĕmma laina radula nī devulai vuṁḍunu