యింతి నీ చుట్టరికము లెటువంటివి
(॥పల్లవి॥)
యింతి నీ చుట్టరికము లెటువంటివి
సంతోసము లిద్దరికి సరివచ్చెను
(॥॥)
కలువ రేకుల వంటి కన్నుల నింతిఁ జూడఁగా
చెలిమోముఁ జందురుఁ డు చెంగలించెను
వలపుల మచ్చికల వసంతము చల్లఁగాను
కులుకుఁ జన్నుల పూవు గుత్తులు సొంపెక్కెను
(॥॥)
అరిది పలుకుఁ దేనె లట్టే నీవు గురియఁగా
నిరతిఁ గొప్పుతేఁటులు నిండు కొనెను
వెరవుతోఁ జిఱునవ్వు వెన్నెలలు వూయఁగాను
విరహపు మబ్బు వాసి వేడుకలు రేఁగెను
(॥॥)
మితి మీఱి నీ విపుడు మేఘమవై వాలఁగాను
అతివ కౌఁగిట మెఱుఁ గై మెరిసెను
ఇతవై శ్రీ వేంకటేశ యీకె నిట్టే పెండ్లాడఁగా
చతురత నీపై సేసలు నించెను
(||pallavi||)
yiṁti nī suṭṭarigamu lĕḍuvaṁṭivi
saṁtosamu liddarigi sarivachchĕnu
(||||)
kaluva regula vaṁṭi kannula niṁtim̐ jūḍam̐gā
sĕlimomum̐ jaṁdurum̐ ḍu sĕṁgaliṁchĕnu
valabula machchigala vasaṁtamu sallam̐gānu
kulugum̐ jannula pūvu guttulu sŏṁpĕkkĕnu
(||||)
aridi palugum̐ denĕ laṭṭe nīvu guriyam̐gā
niradim̐ gŏppudem̐ṭulu niṁḍu kŏnĕnu
vĕravudom̐ jiṟunavvu vĕnnĕlalu vūyam̐gānu
virahabu mabbu vāsi veḍugalu rem̐gĕnu
(||||)
midi mīṟi nī vibuḍu meghamavai vālam̐gānu
adiva kaum̐giḍa mĕṟum̐ gai mĕrisĕnu
idavai śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe pĕṁḍlāḍam̐gā
sadurada nībai sesalu niṁchĕnu