Yimtesi kobanu nenu ichchagame sese neegu

యింతేసి కోపను నేను ఇచ్చకమే సేసే నీకు
Language

(॥పల్లవి॥)
యింతేసి కోపను నేను ఇచ్చకమే సేసే నీకు
చెంతల నన్నలయించి సిగ్గులు రేఁచకుమీ

(॥॥)
పంతము గొనే యాఁటది పై పై బిగియఁ జొచ్చు
వంతుకు వచ్చినాఁటది వాసు లెంచదు
వింతయైన యాఁటది భావించి గుట్టున నుండు
జంతయైన యాఁటది సాదించును

(॥॥)
మాయదారి యాఁటది నేమములు చూపఁగవచ్చు
చాయలాఁడే యాఁటది సన్న చేసును
దాయగత్తైన యాఁటది తగిలి పెనఁగవచ్చు
పూయక దూలైనాఁటది పొంచులే వినును

(॥॥)
గబ్బియైన యాఁటది గక్కనఁ గౌఁగిట నించు
వుబ్బరి యైన యాఁటది వొడివట్టును
గొబ్బున శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నిట్టే
అబ్బురపు గుణమాఁట దంకెలఁ జంకించును

(||pallavi||)
yiṁtesi kobanu nenu ichchagame sese nīgu
sĕṁtala nannalayiṁchi siggulu rem̐sagumī

(||||)
paṁtamu gŏne yām̐ṭadi pai pai bigiyam̐ jŏchchu
vaṁtugu vachchinām̐ṭadi vāsu lĕṁchadu
viṁtayaina yām̐ṭadi bhāviṁchi guṭṭuna nuṁḍu
jaṁtayaina yām̐ṭadi sādiṁchunu

(||||)
māyadāri yām̐ṭadi nemamulu sūbam̐gavachchu
sāyalām̐ḍe yām̐ṭadi sanna sesunu
dāyagattaina yām̐ṭadi tagili pĕnam̐gavachchu
pūyaga dūlainām̐ṭadi pŏṁchule vinunu

(||||)
gabbiyaina yām̐ṭadi gakkanam̐ gaum̐giḍa niṁchu
vubbari yaina yām̐ṭadi vŏḍivaṭṭunu
gŏbbuna śhrī veṁkaḍeśha kūḍidivi nannu niṭṭe
abburabu guṇamām̐ṭa daṁkĕlam̐ jaṁkiṁchunu