Yimtagamte nemi sesu yidi saaladaa naagu

యింతకంటె నేమి సేసు యిది చాలదా నాకు
Language

(॥పల్లవి॥)
యింతకంటె నేమి సేసు యిది చాలదా నాకు
సంతసము రేఁచి ఇంత చన విచ్చినాఁడూ

(॥॥)
తగవరి తా నౌనే దయగలవాఁడూ నౌనే
జగమెల్లా నెరిఁగిన జాణఁడూ నౌనే
వెగటుగా తన్నుఁబాసి విరహాన నున్న నన్ను
మొగము చూచి నాచే మొక్కించుకొన్నాఁడే

(॥॥)
వొడఁబరచ నేర్చునే వొద్దికై వుండ నేర్చునే
చిడిముడి నంది పొందుసేయ నేర్చునే
కడఁగి తన్నుఁజూడక కాఁకలఁ బొరలే నన్ను
వొడివట్టి నాకు మోవి యొసఁగినాఁడు

(॥॥)
విన్నపాలు వినేనే వీడు దొర్లాడేనే
యిన్నిటాఁ దా శ్రీ వేంకటేశ్వరుఁడే
మన్నించి యలమేలు మంగనైన నన్నుఁ గూడె
వున్నతపు రతులను వోలలార్చినాఁడు

(||pallavi||)
yiṁtagaṁṭĕ nemi sesu yidi sāladā nāgu
saṁtasamu rem̐si iṁta sana vichchinām̐ḍū

(||||)
tagavari tā naune dayagalavām̐ḍū naune
jagamĕllā nĕrim̐gina jāṇam̐ḍū naune
vĕgaḍugā tannum̐bāsi virahāna nunna nannu
mŏgamu sūsi nāse mŏkkiṁchugŏnnām̐ḍe

(||||)
vŏḍam̐barasa nersune vŏddigai vuṁḍa nersune
siḍimuḍi naṁdi pŏṁduseya nersune
kaḍam̐gi tannum̐jūḍaga kām̐kalam̐ bŏrale nannu
vŏḍivaṭṭi nāgu movi yŏsam̐ginām̐ḍu

(||||)
vinnabālu vinene vīḍu dŏrlāḍene
yinniḍām̐ dā śhrī veṁkaḍeśhvarum̐ḍe
manniṁchi yalamelu maṁganaina nannum̐ gūḍĕ
vunnadabu radulanu volalārsinām̐ḍu