Yimta valabimchugomti vidivo nannu

యింత వలపించుకొంటి విదివో నన్ను
Language

(॥పల్లవి॥)
యింత వలపించుకొంటి విదివో నన్ను
యెంత కెంత నా యాసోదమేమి చెప్పేనయ్యా

(॥॥)
కన్నులఁ జూతు నిన్ను కరఁగుదు మనసులో
సన్నలనే నీ మోవిచవి గొందును
చన్నుల నొత్తఁ దలఁతు జలజలఁ జెమరింతు
యెన్నికలు నాలోనివి యేమి చెప్పేనయ్యా

(॥॥)
చక్కఁదనాలకు మెత్తు సారెఁ జే యెత్తి మొక్కుదు
పక్క నున్నవానిఁగా భావించుకొందు
చొక్కి నిన్నుఁ జేరుకొందు జుమ్మనఁ బులకింతు
యిక్కువ నా తలపోఁత లేమి చెప్పేనయ్యా

(॥॥)
చెనకె నంటా వత్తు సిగ్గుపడుదు నంతలో
ననిచి శ్రీ వేంకటేశ నవ్వుదు నీతో
అనిశము నన్నేలితి వలమేల్మంగను నేను
యెనసి నా కోరిక లేమి చెప్పేనయ్యా.

(||pallavi||)
yiṁta valabiṁchugŏṁṭi vidivo nannu
yĕṁta kĕṁta nā yāsodamemi sĕppenayyā

(||||)
kannulam̐ jūdu ninnu karam̐gudu manasulo
sannalane nī movisavi gŏṁdunu
sannula nŏttam̐ dalam̐tu jalajalam̐ jĕmariṁtu
yĕnnigalu nālonivi yemi sĕppenayyā

(||||)
sakkam̐danālagu mĕttu sārĕm̐ je yĕtti mŏkkudu
pakka nunnavānim̐gā bhāviṁchugŏṁdu
sŏkki ninnum̐ jerugŏṁdu jummanam̐ bulagiṁtu
yikkuva nā talabom̐ta lemi sĕppenayyā

(||||)
sĕnagĕ naṁṭā vattu siggubaḍudu naṁtalo
nanisi śhrī veṁkaḍeśha navvudu nīdo
aniśhamu nannelidi valamelmaṁganu nenu
yĕnasi nā koriga lemi sĕppenayyā.