యింత చాలదా తనకు నింతులతోడి చలము
(॥పల్లవి॥)
యింత చాలదా తనకు నింతులతోడి చలము
వింత సేయకు మనుచు వేఁడుకొంటీఁ గదవే
(॥॥)
నన్ను నేల చెనకీని నాతో నేల పెనఁగీని
మొన్ననే తనకు నేను మొక్కితిఁ గదే
సన్నలేల సేసీని జారుఁ బయ్య దే లంటీని
యెన్నికతోఁ బంతా లెల్లా నిచ్చితిఁ గదే
(॥॥)
చొప్పు లేల యెత్తీని సొమ్ము లెన్ని యిచ్చీని
అప్పుడే తనకు నేనూఁ జెప్పితిఁ గదే
కొప్పేల దువ్వీని గోరేల సోఁకించీని
చిప్పిల నూడిగా లెల్లాఁ జేసితిఁ గదే
(॥॥)
పెదవు లేల మోపిని ప్రియ మెంత చెప్పీని
యిదివో కౌఁగిలించితి నిట్టే కదే
యెదుట శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్ను నేలె
సదరాన నేమి నవ్వి సతి నైతిఁ గదవే
(||pallavi||)
yiṁta sāladā tanagu niṁtuladoḍi salamu
viṁta seyagu manusu vem̐ḍugŏṁṭīm̐ gadave
(||||)
nannu nela sĕnagīni nādo nela pĕnam̐gīni
mŏnnane tanagu nenu mŏkkidim̐ gade
sannalela sesīni jārum̐ bayya de laṁṭīni
yĕnnigadom̐ baṁtā lĕllā nichchidim̐ gade
(||||)
sŏppu lela yĕttīni sŏmmu lĕnni yichchīni
appuḍe tanagu nenūm̐ jĕppidim̐ gade
kŏppela duvvīni gorela som̐kiṁchīni
sippila nūḍigā lĕllām̐ jesidim̐ gade
(||||)
pĕdavu lela mobini priya mĕṁta sĕppīni
yidivo kaum̐giliṁchidi niṭṭe kade
yĕduḍa śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannu nelĕ
sadarāna nemi navvi sadi naidim̐ gadave