Yimta nee vubagaaramu le mani pogadudu

యింత నీ వుపకారము లే మని పొగడుదు
Language

(॥పల్లవి॥)
యింత నీ వుపకారము లే మని పొగడుదు
సంతసించి యేలితి నా సరివారిలోనా

(॥॥)
కలవు నాకు నీ వని గర్వించి వుండుట గాక
చెలఁగి నీకుఁ బ్రియము చెప్పవత్తునా
నలువంక నటువంటి ననుఁ దెచ్చి నీ సేవకు
అలవఱచుక నన్ను నాదరించితివి

(॥॥)
చుట్టరికపు వరుస సుద్దులె చెప్పుదుఁ గాక
నెట్టుక నీ కొలువులో నిలుచుందునా
యిట్టి నన్ను మన్నించి నీ యెదుట నిలుపుకొని
గుట్టు దెలిపి నాకు నీ గుణము నేర్పితివి

(॥॥)
నీ విచ్చిన సలిగల నే దొరనై వుందుఁ గాక
యీవిధాన నీ యక్కుపై నిర వౌదునా
శ్రీ వేంకటేశుఁడ నేను జిగి నలమేల్మంగను
వావి తోడ నన్నుఁగూడి వన్నె కెక్కించితివి

(||pallavi||)
yiṁta nī vubagāramu le mani pŏgaḍudu
saṁtasiṁchi yelidi nā sarivārilonā

(||||)
kalavu nāgu nī vani garviṁchi vuṁḍuḍa gāga
sĕlam̐gi nīgum̐ briyamu sĕppavattunā
naluvaṁka naḍuvaṁṭi nanum̐ dĕchchi nī sevagu
alavaṟasuga nannu nādariṁchidivi

(||||)
suṭṭarigabu varusa suddulĕ sĕppudum̐ gāga
nĕṭṭuga nī kŏluvulo nilusuṁdunā
yiṭṭi nannu manniṁchi nī yĕduḍa nilubugŏni
guṭṭu dĕlibi nāgu nī guṇamu nerbidivi

(||||)
nī vichchina saligala ne dŏranai vuṁdum̐ gāga
yīvidhāna nī yakkubai nira vaudunā
śhrī veṁkaḍeśhum̐ḍa nenu jigi nalamelmaṁganu
vāvi toḍa nannum̐gūḍi vannĕ kĕkkiṁchidivi