యింత కంటే సుద్దులు నే మెఱఁగము
(॥పల్లవి॥)
యింత కంటే సుద్దులు నే మెఱఁగము
వింత లెల్లా నీకు విన్నవించఁగ వచ్చితిమీ
(॥॥)
మనసెల్లా నీ మీఁద మంతనాలు చెలులతో
తనువు పానుపుమీఁదఁ దరుణికిని
కనుఁగొంటే దయ వుట్టు కడ నున్నవారికైనా
వినవయ్య నీకు విన్నవించఁ గ వచ్చితిమి
(॥॥)
గుఱిగాఁ జేయి చెక్కుపై కొనచూపు నీ రాకపై
జఱము నిట్టూర్పులు చన్నులమీఁద
కఱకురా యైనాను కరఁగుఁబో నీకువలె
వెఱగంది యిదే విన్న వించఁగ వచ్చితిమి
(॥॥)
అలయిక తనలోన ఆసలు నీ కౌఁగిటిపై
సెలవుల లేనగవు శ్రీ వేంకటేశ
కలిసితి వింక మేడ కంబమైనా నిగిరించు
వెలసే వేడుక విన్నవించఁగ వచ్చితిమి
(||pallavi||)
yiṁta kaṁṭe suddulu ne mĕṟam̐gamu
viṁta lĕllā nīgu vinnaviṁcham̐ga vachchidimī
(||||)
manasĕllā nī mīm̐da maṁtanālu sĕlulado
tanuvu pānubumīm̐dam̐ daruṇigini
kanum̐gŏṁṭe daya vuṭṭu kaḍa nunnavārigainā
vinavayya nīgu vinnaviṁcham̐ ga vachchidimi
(||||)
guṟigām̐ jeyi sĕkkubai kŏnasūbu nī rāgabai
jaṟamu niṭṭūrbulu sannulamīm̐da
kaṟagurā yainānu karam̐gum̐bo nīguvalĕ
vĕṟagaṁdi yide vinna viṁcham̐ga vachchidimi
(||||)
alayiga tanalona āsalu nī kaum̐giḍibai
sĕlavula lenagavu śhrī veṁkaḍeśha
kalisidi viṁka meḍa kaṁbamainā nigiriṁchu
vĕlase veḍuga vinnaviṁcham̐ga vachchidimi