యింకనైన రావే యిదే వచ్చె రమణుఁడు
(॥పల్లవి॥)
యింకనైన రావే యిదే వచ్చె రమణుఁడు
మంకు లేకుండితేను నీ మగఁడిట్టె మెచ్చును
(॥॥)
సిగ్గుగలదానికి చెల్లును పంతము లెల్లా
యెగ్గుపట్టనిదానికి నెనయుఁ బొందు
వొగ్గి వినయపు దాని కొనగూడు వేడుకలు
వెగ్గళించక నా బుద్ది వింటెఁ బతి మెచ్చునే
(॥॥)
వోరిచివున్న దానికి నొద్దికౌఁ జుట్టరికము
నేరిచిన దానికి నిండు సిరులు
మేరతో నవ్వేదానికి మిక్కుటమౌ రాజసము
యీరీతి నా బుద్ది వింటే నీ విభుఁడు మెచ్చునే
(॥॥)
గుట్టున నున్న దానికి గుణము లోజకు వచ్చు
దిట్టయైన దానికి తేఁకువ గల్గు
నెట్టన శ్రీ వేంకటనిలయుఁడు నిన్ను నేలె
యిట్టి నా బుద్ది వింటే నీతఁడింకా మెచ్చునే
(||pallavi||)
yiṁkanaina rāve yide vachchĕ ramaṇum̐ḍu
maṁku leguṁḍidenu nī magam̐ḍiṭṭĕ mĕchchunu
(||||)
siggugaladānigi sĕllunu paṁtamu lĕllā
yĕggubaṭṭanidānigi nĕnayum̐ bŏṁdu
vŏggi vinayabu dāni kŏnagūḍu veḍugalu
vĕggaḽiṁchaga nā buddi viṁṭĕm̐ badi mĕchchune
(||||)
vorisivunna dānigi nŏddigaum̐ juṭṭarigamu
nerisina dānigi niṁḍu sirulu
merado navvedānigi mikkuḍamau rājasamu
yīrīdi nā buddi viṁṭe nī vibhum̐ḍu mĕchchune
(||||)
guṭṭuna nunna dānigi guṇamu lojagu vachchu
diṭṭayaina dānigi tem̐kuva galgu
nĕṭṭana śhrī veṁkaḍanilayum̐ḍu ninnu nelĕ
yiṭṭi nā buddi viṁṭe nīdam̐ḍiṁkā mĕchchune