Yimkaam jinnagoomturaa yimtelammaa

యింకాఁ జిన్నకూఁతురా యింతేలమ్మా
Language

(॥పల్లవి॥)
యింకాఁ జిన్నకూఁతురా యింతేలమ్మా
పొంకపు జవ్వని కిట్టే బుద్ధి చెప్పరమ్మా

(॥॥)
సెలవి నవ్వులుదేరి సిగ్గులు మోమునఁ గారీ
అలివేణి నిదేలని యడుగరమ్మా
బలిమిసేసి యతఁడు పైఁ జేయి వేయఁగాను
వులికి గోళ్ళఁ జిమ్మీ నొద్దనరమ్మా

(॥॥)
కన్నులకుఁ గెంపు లెక్కె కాయము లోలోఁ జొక్కె
యిన్నేసి సుద్దులు దనకెక్కడి వమ్మా
సన్నలు సేసి విభుఁడు చనవు మెరయఁగాను
నిన్నటనుండి యలిగీ నేఁడు మొక్కరమ్మా

(॥॥)
తమకము మతి నిండెఁ దపము లన్నియుఁ బండె
సముకాన మోనములు చవి గావమ్మా
అమర శ్రీ వేంకటేశుఁ డాదరించి కూడఁగాను
జమలి పంతము లిట్టే సరిఁ దూగీనమ్మా.

(||pallavi||)
yiṁkām̐ jinnagūm̐turā yiṁtelammā
pŏṁkabu javvani kiṭṭe buddhi sĕpparammā

(||||)
sĕlavi navvuluderi siggulu momunam̐ gārī
aliveṇi nidelani yaḍugarammā
balimisesi yadam̐ḍu paim̐ jeyi veyam̐gānu
vuligi goḽḽam̐ jimmī nŏddanarammā

(||||)
kannulagum̐ gĕṁpu lĕkkĕ kāyamu lolom̐ jŏkkĕ
yinnesi suddulu danagĕkkaḍi vammā
sannalu sesi vibhum̐ḍu sanavu mĕrayam̐gānu
ninnaḍanuṁḍi yaligī nem̐ḍu mŏkkarammā

(||||)
tamagamu madi niṁḍĕm̐ dabamu lanniyum̐ baṁḍĕ
samugāna monamulu savi gāvammā
amara śhrī veṁkaḍeśhum̐ ḍādariṁchi kūḍam̐gānu
jamali paṁtamu liṭṭe sarim̐ dūgīnammā.