Yimkaa nela paraagulu yimkaa nela siggulu

యింకా నేల పరాకులు యింకా నేల సిగ్గులు
Language

(॥పల్లవి॥)
యింకా నేల పరాకులు యింకా నేల సిగ్గులు
సంకెలన్నియునుఁ దీరె చన వియ్యవయ్యా

(॥॥)
మూసిన ముత్తెము వలె ముంగిట నిలుచున్నదీ
ఆసపడ్డ చెలితో మాటాడవయ్యా
సూసకము గట్టుకొని చూచీ నీ మొగమే
సేస ముత్యాల తోడఁ జిత్తగించవయ్యా

(॥॥)
సెలవి నవ్వుల తోడ శిరసు వంచుకున్నదీ
చెలరేఁగి కొనగోరఁ జెనకవయ్యా
కలయికలకు నీ కొలువులు సేసీని
లలిఁ జెక్కు నొక్కి యిట్టే లాలించవయ్యా

(॥॥)
మచ్చిక నీ కౌఁ గిటికి మనసు పెట్టు కున్నది
కుచ్చి కుచ్చి కౌఁగిటఁ గూడవయ్యా
యిచ్చట శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
యిచ్చల నేలీతి విట్టే యీడేర్చవయ్యా

(||pallavi||)
yiṁkā nela parāgulu yiṁkā nela siggulu
saṁkĕlanniyunum̐ dīrĕ sana viyyavayyā

(||||)
mūsina muttĕmu valĕ muṁgiḍa nilusunnadī
āsabaḍḍa sĕlido māḍāḍavayyā
sūsagamu gaṭṭugŏni sūsī nī mŏgame
sesa mutyāla toḍam̐ jittagiṁchavayyā

(||||)
sĕlavi navvula toḍa śhirasu vaṁchugunnadī
sĕlarem̐gi kŏnagoram̐ jĕnagavayyā
kalayigalagu nī kŏluvulu sesīni
lalim̐ jĕkku nŏkki yiṭṭe lāliṁchavayyā

(||||)
machchiga nī kaum̐ giḍigi manasu pĕṭṭu kunnadi
kuchchi kuchchi kaum̐giḍam̐ gūḍavayyā
yichchaḍa śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
yichchala nelīdi viṭṭe yīḍersavayyā