Yimka nemti melamulu yimtidoda neegunu

యింక నేఁటి మేలములు యింతితోడ నీకును
Language

(॥పల్లవి॥)
యింక నేఁటి మేలములు యింతితోడ నీకును
అంకెలఁ గరుణ నేలి ఆదరించరాదా

(॥॥)
చెంది నీకు మొక్కఁగాను చెమటలు గరఁగీని
కందువ నీ పాదాలంటె కస్తూరి బొట్టు
అంది కానుకియ్యఁగాను అట్టే తన కొప్పువీడి
ఇందు నిన్నుఁగప్పుకొనె నింద్రనీలాలు

(॥॥)
విన్నపము సేసుకోఁగా వెసఁదామరలవలె
నిన్నంటెఁ బూజించినట్టు నిండుఁ జన్నులు
చెన్నుమీరఁ జేయరాని సేవ నీకుఁ జేయఁగాను
పన్నీరు గులికినట్టు పైఁజిందేఁ జెమటా

(॥॥)
మంచి మాట లాడఁగాను మధురాలు సోఁకి సోఁకి
ముంచి నీ పెదవి నంటె మోవిపండు
యెంచఁగ శ్రీ వేంకటేశ యీకె నిట్టే యేలితివి
మించె జవ్వనమదపు మేటి వాసన

(||pallavi||)
yiṁka nem̐ṭi melamulu yiṁtidoḍa nīgunu
aṁkĕlam̐ garuṇa neli ādariṁcharādā

(||||)
sĕṁdi nīgu mŏkkam̐gānu sĕmaḍalu garam̐gīni
kaṁduva nī pādālaṁṭĕ kastūri bŏṭṭu
aṁdi kānugiyyam̐gānu aṭṭe tana kŏppuvīḍi
iṁdu ninnum̐gappugŏnĕ niṁdranīlālu

(||||)
vinnabamu sesugom̐gā vĕsam̐dāmaralavalĕ
ninnaṁṭĕm̐ būjiṁchinaṭṭu niṁḍum̐ jannulu
sĕnnumīram̐ jeyarāni seva nīgum̐ jeyam̐gānu
pannīru guliginaṭṭu paim̐jiṁdem̐ jĕmaḍā

(||||)
maṁchi māḍa lāḍam̐gānu madhurālu som̐ki som̐ki
muṁchi nī pĕdavi naṁṭĕ movibaṁḍu
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe yelidivi
miṁchĕ javvanamadabu meḍi vāsana