Yimka nele veṟabu yimta sese naa vibhumdu

యింక నేలే వెఱపు యింత సేసే నా విభుఁడు
Language

(॥పల్లవి॥)
యింక నేలే వెఱపు యింత సేసే నా విభుఁడు
లంకె లొనరేను మా లాగు లెల్లా మంచివే

(॥॥)
చనవు గలుగువారి చరిత లెల్లాఁ జెల్లు
మన సొక్కటైన వారి మాట లీడేరు
తనివిఁ బొందినవారి తలఁపులు చక్కనుండు
ననిచినవారి సన్నలు చవు లవును

(॥॥)
అంది పొందినవారి ఆస లిట్టే నేరవేరు
విందు వినోదపు వారి వేడుక మేలు
కందువ చుట్టపు వారి కాఁపురాలు తలకూడు
చందపు వయసు వారి సరసము మెఱయు

(॥॥)
పాయక కూడిన వారి పంతములు గొనసాగు
దాయగాండ్లైనవారి తగులు మెచ్చు
యీ యెడ శ్రీ వేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలే
చాయకు వచ్చినవారి జాడలు ఫలించును

(||pallavi||)
yiṁka nele vĕṟabu yiṁta sese nā vibhum̐ḍu
laṁkĕ lŏnarenu mā lāgu lĕllā maṁchive

(||||)
sanavu galuguvāri sarida lĕllām̐ jĕllu
mana sŏkkaḍaina vāri māḍa līḍeru
tanivim̐ bŏṁdinavāri talam̐pulu sakkanuṁḍu
nanisinavāri sannalu savu lavunu

(||||)
aṁdi pŏṁdinavāri āsa liṭṭe neraveru
viṁdu vinodabu vāri veḍuga melu
kaṁduva suṭṭabu vāri kām̐purālu talagūḍu
saṁdabu vayasu vāri sarasamu mĕṟayu

(||||)
pāyaga kūḍina vāri paṁtamulu gŏnasāgu
dāyagāṁḍlainavāri tagulu mĕchchu
yī yĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nele
sāyagu vachchinavāri jāḍalu phaliṁchunu