Yimka nela maa vinnabaalinniyu nimde vunnavi

యింక నేల మా విన్నపాలిన్నియు నిందే వున్నవి
Language

(॥పల్లవి॥)
యింక నేల మా విన్నపాలిన్నియు నిందే వున్నవి
సంకు దీరె మాకు మీకు సారె మొక్కేమయ్యా

(॥॥)
యెప్పుడు చూతునో యంటా యింతి నిన్నుఁ దలపోసి
చిప్పిలఁ దన చెక్కులు చెమరించెను
అప్పుడే నీవు విచ్చేసి ఆపెమోము చూచి నవ్వి
విప్పుచు సురటిఁ గొని విసరితి వయ్యా

(॥॥)
యేమాటో నిన్నాడే నని యెదుట నీ వుండఁగాను
మోమోటానఁ బులకించి మోనాన నుండె
ఆమాటే నీవు నాడి అంగన మే నెల్లా నిండ
చే ముట్టి గందవొడి నించితి గద వయ్యా

(॥॥)
ఇట్టే నిన్ను నిలిపి ఇచ్చకము సేసే నంటా
దట్ట మై శ్రీ వేంకటేశ తమకించెను
అట్టి నీవూ నిలిచి అతివఁ గూడి మరియు
మట్టు మీరఁ జన విచ్చి మన్నించితి వయ్యా.

(||pallavi||)
yiṁka nela mā vinnabālinniyu niṁde vunnavi
saṁku dīrĕ māgu mīgu sārĕ mŏkkemayyā

(||||)
yĕppuḍu sūduno yaṁṭā yiṁti ninnum̐ dalabosi
sippilam̐ dana sĕkkulu sĕmariṁchĕnu
appuḍe nīvu vichchesi ābĕmomu sūsi navvi
vippusu suraḍim̐ gŏni visaridi vayyā

(||||)
yemāḍo ninnāḍe nani yĕduḍa nī vuṁḍam̐gānu
momoḍānam̐ bulagiṁchi monāna nuṁḍĕ
āmāḍe nīvu nāḍi aṁgana me nĕllā niṁḍa
se muṭṭi gaṁdavŏḍi niṁchidi gada vayyā

(||||)
iṭṭe ninnu nilibi ichchagamu sese naṁṭā
daṭṭa mai śhrī veṁkaḍeśha tamagiṁchĕnu
aṭṭi nīvū nilisi adivam̐ gūḍi mariyu
maṭṭu mīram̐ jana vichchi manniṁchidi vayyā.