Yimdugu nee sittamuna nemta yemme lanagumee

యిందుకు నీ చిత్తమున నెంత యెమ్మె లనకుమీ
Language

(॥పల్లవి॥)
యిందుకు నీ చిత్తమున నెంత యెమ్మె లనకుమీ
చెంది నీ చుట్టరికమే చెప్పుకొంటీఁ జుమ్మీ

(॥॥)
నలువంక నీ వెప్పుడు నాపై బత్తి సేతు వని
అలరి చెలులతో నే నాడుకొందును
వెలయఁగ నీవు నా విన్నపము విందువని
కలిమి మెఱసి నే గర్వమున నుందును

(॥॥)
వుదుటున నీవు నాకు నుంగర మిచ్చితి వని
సుదతుల కెల్లా నేఁ జూపుదును
చెదరక నీవు నా చెప్పినట్టు సేతు వని
పది మారులును నేను పందేలు వేతును

(॥॥)
నన్ను నీవు మన్నింతువు నా వాఁడవే యని
మిన్నకైనా సలిగెలు మెఱతు నేనూ
యిన్నిటా శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సన్నలా చాయలా నవ్వి సంతోసించుకొందును

(||pallavi||)
yiṁdugu nī sittamuna nĕṁta yĕmmĕ lanagumī
sĕṁdi nī suṭṭarigame sĕppugŏṁṭīm̐ jummī

(||||)
naluvaṁka nī vĕppuḍu nābai batti sedu vani
alari sĕlulado ne nāḍugŏṁdunu
vĕlayam̐ga nīvu nā vinnabamu viṁduvani
kalimi mĕṟasi ne garvamuna nuṁdunu

(||||)
vuduḍuna nīvu nāgu nuṁgara michchidi vani
sudadula kĕllā nem̐ jūbudunu
sĕdaraga nīvu nā sĕppinaṭṭu sedu vani
padi mārulunu nenu paṁdelu vedunu

(||||)
nannu nīvu manniṁtuvu nā vām̐ḍave yani
minnagainā saligĕlu mĕṟadu nenū
yinniḍā śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sannalā sāyalā navvi saṁtosiṁchugŏṁdunu