యిందుకు నవ్వకుమీ యిట్టే నీ మంచితనము
(॥పల్లవి॥)
యిందుకు నవ్వకుమీ యిట్టే నీ మంచితనము
పొందుగా నీ కీరితిగాఁ బొగడితి నేను
(॥॥)
ఇంతుల ముందర నెల్లా నెమ్మె లెల్లాఁ జెప్పుకొంటి
కాంతుఁడవు నీవు నాకుఁ గలవంటాను
పంతాన మురిపెమునఁ బైపైనే మెరసితి
చెంతల నన్ను సింగారించితి వంటాను
(॥॥)
చొక్కి నీవు నాకిచ్చిన సొమ్ము లెల్లాఁ జూపితి
చిక్కి నేఁడు నాకు మోహించితి వంటాను
నిక్కెపు గర్వము లెల్లా నెరపితి సబలోన
వుక్కున నా మాటలోనే వుండదు వుంటాను
(॥॥)
పైకొని చెలుల చేత పాటలు పాడించుకొంటి
చేకొని పట్టపుదేవిఁ జేసితి వంటా
యీకడ శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
నాకు నీడు లేరంటి నన్నే చూతు వంటాను
(||pallavi||)
yiṁdugu navvagumī yiṭṭe nī maṁchidanamu
pŏṁdugā nī kīridigām̐ bŏgaḍidi nenu
(||||)
iṁtula muṁdara nĕllā nĕmmĕ lĕllām̐ jĕppugŏṁṭi
kāṁtum̐ḍavu nīvu nāgum̐ galavaṁṭānu
paṁtāna muribĕmunam̐ baibaine mĕrasidi
sĕṁtala nannu siṁgāriṁchidi vaṁṭānu
(||||)
sŏkki nīvu nāgichchina sŏmmu lĕllām̐ jūbidi
sikki nem̐ḍu nāgu mohiṁchidi vaṁṭānu
nikkĕbu garvamu lĕllā nĕrabidi sabalona
vukkuna nā māḍalone vuṁḍadu vuṁṭānu
(||||)
paigŏni sĕlula seda pāḍalu pāḍiṁchugŏṁṭi
segŏni paṭṭabudevim̐ jesidi vaṁṭā
yīgaḍa śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
nāgu nīḍu leraṁṭi nanne sūdu vaṁṭānu