యిందరిలోనా నిన్ను నింతగా మన్నించెను
(॥పల్లవి॥)
యిందరిలోనా నిన్ను నింతగా మన్నించెను
చెంది మిక్కిలి నీవు సేసినదే భాగ్యమే
(॥॥)
నెపమునఁ దేరకొన నిన్నుఁజూచె నాతఁడు
తపము ఫలించెఁ గా తరుణి నీకు
కృప తోడ నప్పటిని కేలు నీ మీఁద వేసె
యిప్పుడే నీ కోరికలు యీడేరెఁ గదవే
(॥॥)
చెంత నీచే నూడిగము సేయించుకొనె నేఁడు
పంత మెల్ల దక్కెఁగా పడఁతి నీకు
సంతోసానఁ దమ్ములము చనవున నొసఁగెను
చింతించిన నిధానము సిద్ధించెఁ గదవే
(॥॥)
చెలఁగి నీ యింటికి శ్రీ వేంకటేశుఁడు వచ్చే
వలపెల్ల దక్కెఁ గా వనిత నీకు
అలమేలుమంగవు నిన్నక్కుమీఁద నుంచుకొనె
తలఁచిన తలఁపులు దైవారెఁ గదవే
(||pallavi||)
yiṁdarilonā ninnu niṁtagā manniṁchĕnu
sĕṁdi mikkili nīvu sesinade bhāgyame
(||||)
nĕbamunam̐ deragŏna ninnum̐jūsĕ nādam̐ḍu
tabamu phaliṁchĕm̐ gā taruṇi nīgu
kṛpa toḍa nappaḍini kelu nī mīm̐da vesĕ
yippuḍe nī korigalu yīḍerĕm̐ gadave
(||||)
sĕṁta nīse nūḍigamu seyiṁchugŏnĕ nem̐ḍu
paṁta mĕlla dakkĕm̐gā paḍam̐ti nīgu
saṁtosānam̐ dammulamu sanavuna nŏsam̐gĕnu
siṁtiṁchina nidhānamu siddhiṁchĕm̐ gadave
(||||)
sĕlam̐gi nī yiṁṭigi śhrī veṁkaḍeśhum̐ḍu vachche
valabĕlla dakkĕm̐ gā vanida nīgu
alamelumaṁgavu ninnakkumīm̐da nuṁchugŏnĕ
talam̐sina talam̐pulu daivārĕm̐ gadave