యిందరికిఁ గలుగునా యిటువంటి భాగ్యాలు
(॥పల్లవి॥)
యిందరికిఁ గలుగునా యిటువంటి భాగ్యాలు
చెందేవారికి వారు నోఁచిన యంతే కాక
(॥॥)
పాదము నాపై నతఁడు పక్కన జాఁచితేను
సోదించి మీ మొగా లేమి చూచుకొనేరే
సాదించి తా మోవితేనె చవులు నాకిచ్చితేను
ఆదికొని నో గూరే రది యేమే మీరు
(॥॥)
తమ్ముల మాతఁడు నాకు తానే పిల్చి యొసగితే
చిమ్ముచు మీ రేమి సన్న సేసుకొనేరే
కమ్మర నప్పటి నా కైదండ వట్టు కుండితే
పమ్మి లోలోనే సిగ్గులు పడనేలే మీరు
(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ జేరి కౌఁగిలించుకొంటే
యీవల దోమతెర యేమి వేసేరే
ఆవటించి పెండ్లాడె నలమేల్మంగను నేను
బూవాన నిద్దరి నెంత పొగడేరే మీరు
(||pallavi||)
yiṁdarigim̐ galugunā yiḍuvaṁṭi bhāgyālu
sĕṁdevārigi vāru nom̐sina yaṁte kāga
(||||)
pādamu nābai nadam̐ḍu pakkana jām̐sidenu
sodiṁchi mī mŏgā lemi sūsugŏnere
sādiṁchi tā movidenĕ savulu nāgichchidenu
ādigŏni no gūre radi yeme mīru
(||||)
tammula mādam̐ḍu nāgu tāne pilsi yŏsagide
simmusu mī remi sanna sesugŏnere
kammara nappaḍi nā kaidaṁḍa vaṭṭu kuṁḍide
pammi lolone siggulu paḍanele mīru
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ jeri kaum̐giliṁchugŏṁṭe
yīvala domadĕra yemi vesere
āvaḍiṁchi pĕṁḍlāḍĕ nalamelmaṁganu nenu
būvāna niddari nĕṁta pŏgaḍere mīru