Yimdaramum jeppamgaanu yela siggulu vadeve

యిందరముఁ జెప్పఁగాను యేల సిగ్గులు వడేవే
Language

(॥పల్లవి॥)
యిందరముఁ జెప్పఁగాను యేల సిగ్గులు వడేవే
విందువలె మోవి ఇచ్చి వీడె మియ్యరాదా

(॥॥)
చెక్కునఁ జే యేఁటికి చిరుజెమట లేఁటికి
పెక్కుమారులు నీ పతి పిలువఁగాను
ముక్కుమీఁది వేలేఁటికే ముసి ముసి నవ్వేఁటికే
పక్కనఁ దెరలో నుండే పాదా లొత్తరాదా

(॥॥)
కన్నుల నవ్వ నేఁటికే కంబము మాటేఁటికే
పన్నియాతఁడు నిన్నుఁ దప్పక చూడఁగా
చన్నులు మూయ నేఁటికే సన్నలు సేయ నేఁటికే
మన్నించిన కొలఁది నే మాటలాడరాదా

(॥॥)
తలవంచుకో నేఁటికే తమక మాప నేఁటికే
చెలరేఁగి ని న్నాతఁడు చెనకఁగాను
అలమేల్మంగవు నీవు ఆతఁడు శ్రీవేంకటేశుఁ
డలమి ని న్నేలె నిఁక నల పార్చరాదా

(||pallavi||)
yiṁdaramum̐ jĕppam̐gānu yela siggulu vaḍeve
viṁduvalĕ movi ichchi vīḍĕ miyyarādā

(||||)
sĕkkunam̐ je yem̐ṭigi sirujĕmaḍa lem̐ṭigi
pĕkkumārulu nī padi piluvam̐gānu
mukkumīm̐di velem̐ṭige musi musi navvem̐ṭige
pakkanam̐ dĕralo nuṁḍe pādā lŏttarādā

(||||)
kannula navva nem̐ṭige kaṁbamu māḍem̐ṭige
panniyādam̐ḍu ninnum̐ dappaga sūḍam̐gā
sannulu mūya nem̐ṭige sannalu seya nem̐ṭige
manniṁchina kŏlam̐di ne māḍalāḍarādā

(||||)
talavaṁchugo nem̐ṭige tamaga māba nem̐ṭige
sĕlarem̐gi ni nnādam̐ḍu sĕnagam̐gānu
alamelmaṁgavu nīvu ādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍalami ni nnelĕ nim̐ka nala pārsarādā