యిదివో నీతోడి పొందు యిట్లానే కదవయ్యా
(॥పల్లవి॥)
యిదివో నీతోడి పొందు యిట్లానే కదవయ్యా
సదరాననే వచ్చి జాజుకొనెఁ గూరిమి
(॥॥)
సుద్దులువలెనే వుండు సొలపుల సరసాలు
కొద్దితో మఱవరాదు గుండెలు మోచు
అద్ది వూరకున్న ట్టుండు ఆనకపు కాఁపురాలు
ముద్దు ముద్దువలె నౌను మోవరాని మోపులు
(॥॥)
తేటలు వలెనే వుండు తెలిఁ గన్నుల చూపులు
నాటుకొని సాయరాని నాము లెక్కును
గాటమై దక్కినట్టుండుఁ గప్పురపు వీడేలు
మేటి సమరతులలో మిక్కిలిఁ జొక్కించును
(॥॥)
సులభాలు వలె నుండు చుట్టు కొన్న కూటములు
తలపించఁ దలపించ తమి రేఁచును
యెలమి శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
కలసితి నిఁక నివి కాణాచులై యుండునూ
(||pallavi||)
yidivo nīdoḍi pŏṁdu yiṭlāne kadavayyā
sadarānane vachchi jājugŏnĕm̐ gūrimi
(||||)
sudduluvalĕne vuṁḍu sŏlabula sarasālu
kŏddido maṟavarādu guṁḍĕlu mosu
addi vūragunna ṭṭuṁḍu ānagabu kām̐purālu
muddu mudduvalĕ naunu movarāni mobulu
(||||)
teḍalu valĕne vuṁḍu tĕlim̐ gannula sūbulu
nāḍugŏni sāyarāni nāmu lĕkkunu
gāḍamai dakkinaṭṭuṁḍum̐ gappurabu vīḍelu
meḍi samaradulalo mikkilim̐ jŏkkiṁchunu
(||||)
sulabhālu valĕ nuṁḍu suṭṭu kŏnna kūḍamulu
talabiṁcham̐ dalabiṁcha tami rem̐sunu
yĕlami śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi nim̐ka nivi kāṇāsulai yuṁḍunū