Yidivo nee kadaanane yimtalaayanu

యిదివో నీ కతాననే యింతలాయను
Language

(॥పల్లవి॥)
యిదివో నీ కతాననే యింతలాయను
యెదురు చూచే యాస లేమి చెప్పేమయ్యా

(॥॥)
జవ్వన ముప్పతిల్లి సతి చనుఁగవ యాయ
నివ్వటిల్లుఁ గోరికలే నేరు లాయను
వువ్విళ్ళూరి మోహరస మూరేటి చెమట లాయ
యివ్వల నీకీ సింగారా లేమి చెప్పేమయ్యా

(॥॥)
తరితీపు లింతికి గుత్తపు మోవితేనె లాయ
గరిమనింపులు మోముకళ లాయను
సురతపుఁదమకము చూడఁ జూడఁ గొత్తలాయ
యిరవైన గురుతులు యేమి చెప్పేమయ్యా

(॥॥)
కూటముల నిబ్బరము కొనగోరే వాండ్లాయ
సూటితో నడియాసలు చూపు లాయను
యీటుతో శ్రీ వేంకటేశ యీకె నిట్టే కూడితివి
యేటవెట్టే యీలాగు లేమి చెప్పేమయ్యా

(||pallavi||)
yidivo nī kadānane yiṁtalāyanu
yĕduru sūse yāsa lemi sĕppemayyā

(||||)
javvana muppadilli sadi sanum̐gava yāya
nivvaḍillum̐ gorigale neru lāyanu
vuvviḽḽūri moharasa mūreḍi sĕmaḍa lāya
yivvala nīgī siṁgārā lemi sĕppemayyā

(||||)
taridību liṁtigi guttabu movidenĕ lāya
garimaniṁpulu momugaḽa lāyanu
suradabum̐damagamu sūḍam̐ jūḍam̐ gŏttalāya
yiravaina gurudulu yemi sĕppemayyā

(||||)
kūḍamula nibbaramu kŏnagore vāṁḍlāya
sūḍido naḍiyāsalu sūbu lāyanu
yīḍudo śhrī veṁkaḍeśha yīgĕ niṭṭe kūḍidivi
yeḍavĕṭṭe yīlāgu lemi sĕppemayyā