యిదివో నా వలపే యింత సేసే నన్నును
(॥పల్లవి॥)
యిదివో నా వలపే యింత సేసే నన్నును
వెదకుతా నిందుకే విచారించే నిప్పుడు
(॥॥)
హత్తి నే నవ్వుతాను ఆయము లంటినందుకు
చిత్త మెట్టుండె నోకో చెలువునికి
బత్తి తోడఁ గొంగువట్టి బలిమి సేసినందుకు
చిత్తణి నంటా గైపు సేయఁడు గదా
(॥॥)
ఆన వెట్టి మేడ మీఁది కపు డెక్కించి నందుకు
మే నెంత అలసె నొకో మేటి తనకు
ఆనుక చన్నులు నాట నంటి పెనఁగినందుకు
దీనికెంత యాఁకటని తిట్టఁడు గదా
(॥॥)
యెగ్గనక నేను మోవి యెంగిలి సేసినందుకు
సిగ్గు లెంత రేఁగెనోకో చేరి పతికి
అగ్గమై శ్రీ వేంకటేశుఁడట్టే తా నన్నుఁగూడె
నిగ్గుల గురుతులు మెయి నించఁడు గదా
(||pallavi||)
yidivo nā valabe yiṁta sese nannunu
vĕdagudā niṁduge visāriṁche nippuḍu
(||||)
hatti ne navvudānu āyamu laṁṭinaṁdugu
sitta mĕṭṭuṁḍĕ nogo sĕluvunigi
batti toḍam̐ gŏṁguvaṭṭi balimi sesinaṁdugu
sittaṇi naṁṭā gaibu seyam̐ḍu gadā
(||||)
āna vĕṭṭi meḍa mīm̐di kabu ḍĕkkiṁchi naṁdugu
me nĕṁta alasĕ nŏgo meḍi tanagu
ānuga sannulu nāḍa naṁṭi pĕnam̐ginaṁdugu
dīnigĕṁta yām̐kaḍani tiṭṭam̐ḍu gadā
(||||)
yĕgganaga nenu movi yĕṁgili sesinaṁdugu
siggu lĕṁta rem̐gĕnogo seri padigi
aggamai śhrī veṁkaḍeśhum̐ḍaṭṭe tā nannum̐gūḍĕ
niggula gurudulu mĕyi niṁcham̐ḍu gadā