యిదివో కామినిభావ మెఱిఁగించ వచ్చితిమి
(॥పల్లవి॥)
యిదివో కామినిభావ మెఱిఁగించ వచ్చితిమి
వుదుటు మనోరథాల నోలలాడుచున్నది
(॥॥)
నిన్నుఁ బాసి విరహాన నీ తోడి కూటములు
తన్నుఁ దానె తలపోసి తని వందును
సన్నిధి గల్పించుకొని సారె సారె మాటలాడు
వున్నతపు కొనగోరు వూరకే వూఁదును
(॥॥)
మట్టు మీఱఁ జన్నులు మలగుతో నదుమును
వొట్టు పెట్టి పోకు మను నూరకే నవ్వు
తిట్టులు భావించుకొను దీకొని సరసమాడు
బట్టబయలు కౌఁగిటఁ బట్టు వేఁడుకొనును
(॥॥)
పానుపుపై నిన్నుఁగూడ భావించుఁ జెమరించు
పూనినట్టి భోగములఁ బొద్దు వుచ్చును
ఆనుక శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
యీ నెలవుననే వచ్చి యింతలోఁ గూడితివి
(||pallavi||)
yidivo kāminibhāva mĕṟim̐giṁcha vachchidimi
vuduḍu manorathāla nolalāḍusunnadi
(||||)
ninnum̐ bāsi virahāna nī toḍi kūḍamulu
tannum̐ dānĕ talabosi tani vaṁdunu
sannidhi galbiṁchugŏni sārĕ sārĕ māḍalāḍu
vunnadabu kŏnagoru vūrage vūm̐dunu
(||||)
maṭṭu mīṟam̐ jannulu malagudo nadumunu
vŏṭṭu pĕṭṭi pogu manu nūrage navvu
tiṭṭulu bhāviṁchugŏnu dīgŏni sarasamāḍu
baṭṭabayalu kaum̐giḍam̐ baṭṭu vem̐ḍugŏnunu
(||||)
pānububai ninnum̐gūḍa bhāviṁchum̐ jĕmariṁchu
pūninaṭṭi bhogamulam̐ bŏddu vuchchunu
ānuga śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
yī nĕlavunane vachchi yiṁtalom̐ gūḍidivi