యిది యేమయ్యా నీవు యీపె నేల వొరసేవు
(॥పల్లవి॥)
యిది యేమయ్యా నీవు యీపె నేల వొరసేవు
మదిరాక్షి వొడికము మరి నీ వెఱుఁగవా
(॥॥)
వేడుక కత్తెయైనది వెక్కసాన నవ్వుఁగాక
వాడికైన యిల్లాలికి వరుసా యిది
తోడ నీ కితవైతే సంతోసించు కొందుగాక
వాడ లోని సతులకు నాడికలై వుండగా
(॥॥)
వెలియాలైనది నీతో వింత మాట లాడుఁగాక
కులకాంత కైతే నింత గొరబు గద్దా
చలివాసి తిరిగేటి జాణవు నీ కింపుగాక
యిలలోని కాంతలకు యెగ్గులివి గావా
(॥॥)
ఆసపడి వచ్చినది అన్నిటాఁ జెనకుఁ గాక
వాసితోడ గరితెకి వేసా లేఁటికే
సేసవె ట్టీకె నేలితి శ్రీ వేంకటేశుఁడ నేఁడు
రాసికెక్క నిటువంటి రతి మెచ్చు గాదా
(||pallavi||)
yidi yemayyā nīvu yībĕ nela vŏrasevu
madirākṣhi vŏḍigamu mari nī vĕṟum̐gavā
(||||)
veḍuga kattĕyainadi vĕkkasāna navvum̐gāga
vāḍigaina yillāligi varusā yidi
toḍa nī kidavaide saṁtosiṁchu kŏṁdugāga
vāḍa loni sadulagu nāḍigalai vuṁḍagā
(||||)
vĕliyālainadi nīdo viṁta māḍa lāḍum̐gāga
kulagāṁta kaide niṁta gŏrabu gaddā
salivāsi tirigeḍi jāṇavu nī kiṁpugāga
yilaloni kāṁtalagu yĕggulivi gāvā
(||||)
āsabaḍi vachchinadi anniḍām̐ jĕnagum̐ gāga
vāsidoḍa garidĕgi vesā lem̐ṭige
sesavĕ ṭṭīgĕ nelidi śhrī veṁkaḍeśhum̐ḍa nem̐ḍu
rāsigĕkka niḍuvaṁṭi radi mĕchchu gādā