Yidi naagum badivelu yeppudoo nee daanane

యిది నాకుఁ బదివేలు యెప్పుడూ నీ దాననే
Language

(॥పల్లవి॥)
యిది నాకుఁ బదివేలు యెప్పుడూ నీ దాననే
కొదలేక యెప్పుడైనాఁ గూడేవు గాని

(॥॥)
యేపొద్దూనేఁ గొలువులో నిటు దవ్వులఁ గొల్చినా
చూపులు నీమీఁద నంటి సోఁకి వుండుఁగా
పైపై నీ వెక్కడను పరాకై వుండినాను
యేపుల నీ మోవి నన్ను నిట్టే నోరూరించుఁగా

(॥॥)
తనువుపైఁ బచ్చడము తగఁ గప్పుక వుండినా
మనసు నీతో జంటై పెనఁగాడుఁగా
ననుపున నెవ్వతెతో నవ్వుతా నీ వుండినాను
పనివడి నా మొక్కు నీ పాదాలపై నుండుఁగా

(॥॥)
తచ్చన సిగ్గుతో నీవు తలవంచు కుండినాను
నిచ్చ మరఁదలి వావి నీ కైతిఁగా
యిచ్చట శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
హెచ్చి నన్నుఁ గూడితివి యిట్టే సంతోసింతుఁగా

(||pallavi||)
yidi nāgum̐ badivelu yĕppuḍū nī dānane
kŏdalega yĕppuḍainām̐ gūḍevu gāni

(||||)
yebŏddūnem̐ gŏluvulo niḍu davvulam̐ gŏlsinā
sūbulu nīmīm̐da naṁṭi som̐ki vuṁḍum̐gā
paibai nī vĕkkaḍanu parāgai vuṁḍinānu
yebula nī movi nannu niṭṭe norūriṁchum̐gā

(||||)
tanuvubaim̐ bachchaḍamu tagam̐ gappuga vuṁḍinā
manasu nīdo jaṁṭai pĕnam̐gāḍum̐gā
nanubuna nĕvvadĕdo navvudā nī vuṁḍinānu
panivaḍi nā mŏkku nī pādālabai nuṁḍum̐gā

(||||)
tachchana siggudo nīvu talavaṁchu kuṁḍinānu
nichcha maram̐dali vāvi nī kaidim̐gā
yichchaḍa śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
hĕchchi nannum̐ gūḍidivi yiṭṭe saṁtosiṁtum̐gā