Yidevo naa nomuphala mimka ne verabu ledu

యిదెవో నా నోముఫల మిఁక నే వెరపు లేదు
Language

(॥పల్లవి॥)
యిదెవో నా నోముఫల మిఁక నే వెరపు లేదు
పదిఁ బదై యాసలు నాపైఁ దన కున్నవి

(॥॥)
యెప్పుడూ మరుబాణా లెంత వాఁడియైనా నేమి
తప్పదుగా నామీఁద తన కరుణ
వొప్పుగఁ గోవిల లెంత వొరటుతో నుండినాను
చొప్పులుగాఁ దాఁజూచిన చూపులు నా కున్నవి

(॥॥)
అల చందురుని వెన్నెలంత వెట్ట యైన నేమి
కలదుగా యీ చుట్టరికము తనది
చిలుకలు కొరకొరై చిమ్మి రేఁగఁ బలికినా
చెలరేఁగి తాఁ బెట్టిన సేసలే నా కున్నవి

(॥॥)
మందానిలుఁడు యెంత మందటాడినా నేమి
అందరిలోఁ దన పొందు లబ్బెఁగా నాకు
యిందు శ్రీ వేంకటేశుఁడు యిట్టే తానన్నేలినాఁడు
చందాన నా రెచ్చినట్టి చనవు నా కున్నది

(||pallavi||)
yidĕvo nā nomuphala mim̐ka ne vĕrabu ledu
padim̐ badai yāsalu nābaim̐ dana kunnavi

(||||)
yĕppuḍū marubāṇā lĕṁta vām̐ḍiyainā nemi
tappadugā nāmīm̐da tana karuṇa
vŏppugam̐ govila lĕṁta vŏraḍudo nuṁḍinānu
sŏppulugām̐ dām̐jūsina sūbulu nā kunnavi

(||||)
ala saṁduruni vĕnnĕlaṁta vĕṭṭa yaina nemi
kaladugā yī suṭṭarigamu tanadi
silugalu kŏragŏrai simmi rem̐gam̐ baliginā
sĕlarem̐gi tām̐ bĕṭṭina sesale nā kunnavi

(||||)
maṁdānilum̐ḍu yĕṁta maṁdaḍāḍinā nemi
aṁdarilom̐ dana pŏṁdu labbĕm̐gā nāgu
yiṁdu śhrī veṁkaḍeśhum̐ḍu yiṭṭe tānannelinām̐ḍu
saṁdāna nā rĕchchinaṭṭi sanavu nā kunnadi