యిద్దరూ నిద్దరే మిమ్ము నే మని నుతించేను
(॥పల్లవి॥)
యిద్దరూ నిద్దరే మిమ్ము నే మని నుతించేను
సుద్దులు వింటా మిమ్ముఁ జూచేను నేనూ
(॥॥)
చెలి చక్కఁదనములు చేరి నీతోఁ జెప్పేనంటే
మలసి నీ వైతేను మరుతండ్రివి
పొలసి యీపె నేరుపులు పొగడే నంటేను
అలరి నీవు మాయానాథుఁడవూ
(॥॥)
సతి నిన్ను మోహింపించఁ జతురురా లనే నంటే
రతి వలపించితి గొల్లెతల నీవూ
కతలుగా నేఁడివి కలిమి చెప్పే నంటే
సతతము నీ వైతే సర్వేశ్వరుఁడవూ
(॥॥)
అంగన చనుఁగొండల నధికురా లనే నంటే
రంగున శ్రీ వేంకటాద్రిరాజవు నీవూ
అంగవించి యీపె క్షీరాబ్ధి కూతురనే నంటే
సంగడి నీకే నిచ్చిన జలధియల్లుఁడవూ
(||pallavi||)
yiddarū niddare mimmu ne mani nudiṁchenu
suddulu viṁṭā mimmum̐ jūsenu nenū
(||||)
sĕli sakkam̐danamulu seri nīdom̐ jĕppenaṁṭe
malasi nī vaidenu marudaṁḍrivi
pŏlasi yībĕ nerubulu pŏgaḍe naṁṭenu
alari nīvu māyānāthum̐ḍavū
(||||)
sadi ninnu mohiṁpiṁcham̐ jadururā lane naṁṭe
radi valabiṁchidi gŏllĕdala nīvū
kadalugā nem̐ḍivi kalimi sĕppe naṁṭe
sadatamu nī vaide sarveśhvarum̐ḍavū
(||||)
aṁgana sanum̐gŏṁḍala nadhigurā lane naṁṭe
raṁguna śhrī veṁkaḍādrirājavu nīvū
aṁgaviṁchi yībĕ kṣhīrābdhi kūdurane naṁṭe
saṁgaḍi nīge nichchina jaladhiyallum̐ḍavū