యిద్దరి మేలూ గంటి మిన్నాళ్ళకు నేము
(॥పల్లవి॥)
యిద్దరి మేలూ గంటి మిన్నాళ్ళకు నేము
పొద్దు వొద్దు కేమని పొగడేమే మిమ్మునూ
(॥॥)
సెలవి నవ్వులతోడ చెక్కులఁ జెమట గార
చెలువుని కూడిగాలు సేసే వవునే
వలపు దైవారఁగాను వాసన కొప్పు వీడఁగా
అలసి పాదా లొత్తఁగా నాదరించీ నాతఁడు
(॥॥)
కన్నుల చూపులు నాఁటఁ గస్తూరి వాసన మించ
మన్నన నాతని తోడ మాటాడే వౌనే
చన్నులు గదలఁగాను సారెఁ గుంచ విసరఁగా
నిన్నుఁ జూచి కరఁగీని నివ్వెఱఁ గై యాతఁ డు
(॥॥)
నిట్టూరుపులు రేఁగ నీ మైఁ బులకలు నిండ
బెట్టుగా గందము వూసి పెనఁగే వవునే
యిట్టే శ్రీ వేంకటేశుఁ డెనసె నిన్నూ నన్నూ
గుట్టు తోడ నిద్దరినిఁ గోరి మెచ్చీ నాతఁడు
(||pallavi||)
yiddari melū gaṁṭi minnāḽḽagu nemu
pŏddu vŏddu kemani pŏgaḍeme mimmunū
(||||)
sĕlavi navvuladoḍa sĕkkulam̐ jĕmaḍa gāra
sĕluvuni kūḍigālu sese vavune
valabu daivāram̐gānu vāsana kŏppu vīḍam̐gā
alasi pādā lŏttam̐gā nādariṁchī nādam̐ḍu
(||||)
kannula sūbulu nām̐ṭam̐ gastūri vāsana miṁcha
mannana nādani toḍa māḍāḍe vaune
sannulu gadalam̐gānu sārĕm̐ guṁcha visaram̐gā
ninnum̐ jūsi karam̐gīni nivvĕṟam̐ gai yādam̐ ḍu
(||||)
niṭṭūrubulu rem̐ga nī maim̐ bulagalu niṁḍa
bĕṭṭugā gaṁdamu vūsi pĕnam̐ge vavune
yiṭṭe śhrī veṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnū nannū
guṭṭu toḍa niddarinim̐ gori mĕchchī nādam̐ḍu