యిద్దరి భావాలుఁ గంటి మిదెవో నేము
(॥పల్లవి॥)
యిద్దరి భావాలుఁ గంటి మిదెవో నేము
వొద్దికతోఁ జెమరించె నొరపై నీ మేనను
(॥॥)
చెక్కులఁ జెమట గారీ సిగ్గులు మోమునఁ దేరీ
చొక్కపు చెలియ మోము చూడవయ్యా
మక్కువ నీపై నున్నది మహిమ లెల్లా గన్నదీ
మక్కళించి మాటలాడీ మన్నించు మిపుడు
(॥॥)
చింతతోఁ గ్రుమ్మడివీడీ చిగురుమోవి వాడీ
యింతికేఁ జనవు లెల్లా నియ్యవయ్యా
సంతోసాలు మేన నుబ్బె సరసము లెల్లా నబ్బె
పొంత కిట్టే చేరి తముల మిడవయ్యా
(॥॥)
గుబ్బలఁ గుంకుమ రాలీ కోరిక నీపై వాలీ
జొబ్బిలఁ గూడితి విట్టే చొక్కవయ్యా
అబ్బురపు శ్రీ వేంకటాధిప అలమేల్మంగ
నుబ్బున నేలితి వింకా నొనగూడవయ్యా
(||pallavi||)
yiddari bhāvālum̐ gaṁṭi midĕvo nemu
vŏddigadom̐ jĕmariṁchĕ nŏrabai nī menanu
(||||)
sĕkkulam̐ jĕmaḍa gārī siggulu momunam̐ derī
sŏkkabu sĕliya momu sūḍavayyā
makkuva nībai nunnadi mahima lĕllā gannadī
makkaḽiṁchi māḍalāḍī manniṁchu mibuḍu
(||||)
siṁtadom̐ grummaḍivīḍī sigurumovi vāḍī
yiṁtigem̐ janavu lĕllā niyyavayyā
saṁtosālu mena nubbĕ sarasamu lĕllā nabbĕ
pŏṁta kiṭṭe seri tamula miḍavayyā
(||||)
gubbalam̐ guṁkuma rālī koriga nībai vālī
jŏbbilam̐ gūḍidi viṭṭe sŏkkavayyā
abburabu śhrī veṁkaḍādhiba alamelmaṁga
nubbuna nelidi viṁkā nŏnagūḍavayyā