Yidara sadula mari yemi seppedi

యితర సతుల మరి యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
యితర సతుల మరి యేమి చెప్పేది
పతిబత్తి గలదే చెప్పరాని మేలుది

(॥॥)
కలయక వుండినాను కాంతుని మొగము చూచి
చెలరేఁగి నవ్వేటి చెలి మేలుది
పిలువక మానినాను ప్రియము తోడుత వచ్చి
కొలువు సేసేదే యెక్కుడు మేలుది

(॥॥)
మఱచి వూరకుండినా మక్కువ లెచ్చరించి
నెఱిఁ దమి రేఁచేదే నిండు మేలుది
యెఱుఁగక పరాకైన యెడల నెదుట వచ్చి
గుఱిగా మోము చూపించుకొనేదే మేలుది

(॥॥)
యింతులతో నొకమారు యెట్ట కేలకుఁ గూడినా
సంతోసించు కొనేదే యచ్చపు మేలుది
చింత దీర నేలితివి శ్రీ వేంకటేశ యీకెను
పంతపు టలమేల్మంగే పాయరాని మేలుది

(||pallavi||)
yidara sadula mari yemi sĕppedi
padibatti galade sĕpparāni meludi

(||||)
kalayaga vuṁḍinānu kāṁtuni mŏgamu sūsi
sĕlarem̐gi navveḍi sĕli meludi
piluvaga māninānu priyamu toḍuda vachchi
kŏluvu sesede yĕkkuḍu meludi

(||||)
maṟasi vūraguṁḍinā makkuva lĕchchariṁchi
nĕṟim̐ dami rem̐sede niṁḍu meludi
yĕṟum̐gaga parāgaina yĕḍala nĕduḍa vachchi
guṟigā momu sūbiṁchugŏnede meludi

(||||)
yiṁtulado nŏgamāru yĕṭṭa kelagum̐ gūḍinā
saṁtosiṁchu kŏnede yachchabu meludi
siṁta dīra nelidivi śhrī veṁkaḍeśha yīgĕnu
paṁtabu ṭalamelmaṁge pāyarāni meludi