యెవ్వరు ని న్నొద్దనేరు యేల నీకు వెఱపు
(॥పల్లవి॥)
యెవ్వరు ని న్నొద్దనేరు యేల నీకు వెఱపు
యివ్వలి మోమై నీవు యీకెఁ జూడరాదా
(॥॥)
చెక్కిటి చేత నున్నవి చెలియకు సిగ్గులు
చక్కని మోమునఁ దేరీ సారె నిగ్గులు
పిక్కటిల్లు నవ్వులనే పెట్టే ముగ్గులు
యెక్కడ పరాకు నీకు యీకెఁ జూడరాదా
(॥॥)
సొరిదిఁ గన్నుల నవే చూపుల చిలుకులు
పరగీ చిగురు మోవిపైఁ బలుకులు
సిరుల దంతముల మించీఁ దళుకులు
యెరవు సేయక యిట్టే యీకెఁ జూడరాదా
(॥॥)
సాలెవలిపె పయ్యద చన్నులమీఁది మఱుఁగు
చాలుకొన్న మెయిఁ జెమట జాలు కరఁగు
యేలితివి శ్రీ వేంకటేశ యిన్నిటాను నీవు
యీ లీలనే మన్నించి యీకెఁ జూడరాదా
(||pallavi||)
yĕvvaru ni nnŏddaneru yela nīgu vĕṟabu
yivvali momai nīvu yīgĕm̐ jūḍarādā
(||||)
sĕkkiḍi seda nunnavi sĕliyagu siggulu
sakkani momunam̐ derī sārĕ niggulu
pikkaḍillu navvulane pĕṭṭe muggulu
yĕkkaḍa parāgu nīgu yīgĕm̐ jūḍarādā
(||||)
sŏridim̐ gannula nave sūbula silugulu
paragī siguru movibaim̐ balugulu
sirula daṁtamula miṁchīm̐ daḽugulu
yĕravu seyaga yiṭṭe yīgĕm̐ jūḍarādā
(||||)
sālĕvalibĕ payyada sannulamīm̐di maṟum̐gu
sālugŏnna mĕyim̐ jĕmaḍa jālu karam̐gu
yelidivi śhrī veṁkaḍeśha yinniḍānu nīvu
yī līlane manniṁchi yīgĕm̐ jūḍarādā