Yevvaru mumchinaa vaare yekku damduru logulu

యెవ్వరు ముంచినా వారే యెక్కు డందురు లోకులు
Language

(॥పల్లవి॥)
యెవ్వరు ముంచినా వారే యెక్కు డందురు లోకులు
యివ్వల మీ ఇద్దరిలో నెక్కుడాయఁ జెలియా

(॥॥)
చేయెత్తి పెండ్లి కూఁతురు సేస నీకుఁ బెట్టఁగాను
సోయగపుఁ జూపులఁ జూచేవు నీవు
దోయిలించి ముత్యాలు తొలుతే పోయఁగ వద్దా
పాయపుటింతికిఁ గిందుపడ నీకు నేఁటికే

(॥॥)
తెర యెత్తి నీ మోము దిష్టించి యాపె చూడఁగా
సరుగఁ జన్నులకుఁ జేయి చాఁ చేవు నీవు
పరగ శిరసు మీఁ ద బాసికము కట్టరాదా
తరుణి మాటకు లోనై తగులైతి విపుడు

(॥॥)
కోరి యాపె నిన్ను నిట్టే కూడి కెంగేలు పట్టఁగా
గారబానఁ గంకణము కట్టేవు నీవు
యీ రీతి శ్రీ వేంకటేశ ఇక్కువ లంటఁగ రాదా
వోరిచి రొమ్మునఁ బెట్టు కుండ నిట్టే వలసె

(||pallavi||)
yĕvvaru muṁchinā vāre yĕkku ḍaṁduru logulu
yivvala mī iddarilo nĕkkuḍāyam̐ jĕliyā

(||||)
seyĕtti pĕṁḍli kūm̐turu sesa nīgum̐ bĕṭṭam̐gānu
soyagabum̐ jūbulam̐ jūsevu nīvu
doyiliṁchi mutyālu tŏlude poyam̐ga vaddā
pāyabuḍiṁtigim̐ giṁdubaḍa nīgu nem̐ṭige

(||||)
tĕra yĕtti nī momu diṣhṭiṁchi yābĕ sūḍam̐gā
sarugam̐ jannulagum̐ jeyi sām̐ sevu nīvu
paraga śhirasu mīm̐ da bāsigamu kaṭṭarādā
taruṇi māḍagu lonai tagulaidi vibuḍu

(||||)
kori yābĕ ninnu niṭṭe kūḍi kĕṁgelu paṭṭam̐gā
gārabānam̐ gaṁkaṇamu kaṭṭevu nīvu
yī rīdi śhrī veṁkaḍeśha ikkuva laṁṭam̐ga rādā
vorisi rŏmmunam̐ bĕṭṭu kuṁḍa niṭṭe valasĕ