యెవ్వరివాఁడ వౌతా నెఱుఁగరా దెవ్వరికే
(॥పల్లవి॥)
యెవ్వరివాఁడ వౌతా నెఱుఁగరా దెవ్వరికే
నివ్వటిల్ల మా వాఁడవే నీ వంటా నున్నారము
(॥॥)
యిందు ముఖు లెల్లాను యెదుట నిన్నుఁ జూడఁగా
అందరికి నన్ని రూపు లై యున్నాఁడవు
పొందుగా మతులఁ దలపోసుకొని చూచితేను
అందుకో నట్టే నీవు అక్కడా నున్నాఁడవు
(॥॥)
నెమ్మది ని న్నొక్కనినే నేరుపుతోఁ బిలువఁగా
కొమ్మల నోళ్ళకు నెల్లా గురైనాఁడవు
చిమ్ముఁగొన గోళ్ళవారు చేతులెత్తి మొక్కితేను
పమ్మి నీవే నోముల ఫలము లై నాఁడవు
(॥॥)
ముదితలు రతుల నీ మోవి చవిగొంటేను
అదివో పెక్కేండ్ల విందై వున్నాఁడవు
కదిసి శ్రీ వేంకటేశ కడు సరసాలాడఁగా
సదరాన నందరికి సంతోస మైనాఁడవు
(||pallavi||)
yĕvvarivām̐ḍa vaudā nĕṟum̐garā dĕvvarige
nivvaḍilla mā vām̐ḍave nī vaṁṭā nunnāramu
(||||)
yiṁdu mukhu lĕllānu yĕduḍa ninnum̐ jūḍam̐gā
aṁdarigi nanni rūbu lai yunnām̐ḍavu
pŏṁdugā madulam̐ dalabosugŏni sūsidenu
aṁdugo naṭṭe nīvu akkaḍā nunnām̐ḍavu
(||||)
nĕmmadi ni nnŏkkanine nerubudom̐ biluvam̐gā
kŏmmala noḽḽagu nĕllā gurainām̐ḍavu
simmum̐gŏna goḽḽavāru sedulĕtti mŏkkidenu
pammi nīve nomula phalamu lai nām̐ḍavu
(||||)
mudidalu radula nī movi savigŏṁṭenu
adivo pĕkkeṁḍla viṁdai vunnām̐ḍavu
kadisi śhrī veṁkaḍeśha kaḍu sarasālāḍam̐gā
sadarāna naṁdarigi saṁtosa mainām̐ḍavu