Yevvarim boludu ne nee yimtulalona

యెవ్వరిఁ బోలుదు నే నీ యింతులలోన
Language

(॥పల్లవి॥)
యెవ్వరిఁ బోలుదు నే నీ యింతులలోన
నివ్వటిల్ల వలచి మన్నించితివి గాక

(॥॥)
చిత్తము రా సేవ నీకుఁ జేసేటివారమా
హత్తి నిన్నుఁ గొలిచేటి యంతవారమా
బత్తితోడ నిన్ను నంత భావించేటివారమా
కొత్తలుగా నన్ను మెచ్చి కొనియాడేవు గాక

(॥॥)
నంటున నీతో సారెకు నవ్వేటివారమా
అంటి ముట్టి సరసము లాడేవారమా
జంటల నీ కిచ్చికము జరుపేటి వారమా
యింటనుండి నా రతుల నెనసేవు గాకా

(॥॥)
సొలపుఁ జూపులఁ జూచి చొక్కించేటివారమా
పిలిచి యిచ్చలను మెప్పించేవారమా
యెలమి శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
కలసి నన్ను నిట్టే కరుణించేవు గాకా.

(||pallavi||)
yĕvvarim̐ boludu ne nī yiṁtulalona
nivvaḍilla valasi manniṁchidivi gāga

(||||)
sittamu rā seva nīgum̐ jeseḍivāramā
hatti ninnum̐ gŏliseḍi yaṁtavāramā
battidoḍa ninnu naṁta bhāviṁcheḍivāramā
kŏttalugā nannu mĕchchi kŏniyāḍevu gāga

(||||)
naṁṭuna nīdo sārĕgu navveḍivāramā
aṁṭi muṭṭi sarasamu lāḍevāramā
jaṁṭala nī kichchigamu jarubeḍi vāramā
yiṁṭanuṁḍi nā radula nĕnasevu gāgā

(||||)
sŏlabum̐ jūbulam̐ jūsi sŏkkiṁcheḍivāramā
pilisi yichchalanu mĕppiṁchevāramā
yĕlami śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
kalasi nannu niṭṭe karuṇiṁchevu gāgā.