Yevvarigim galugu nemdee bhaagyamu

యెవ్వరికిఁ గలుగు నేఁడీ భాగ్యము
Language

(॥పల్లవి॥)
యెవ్వరికిఁ గలుగు నేఁడీ భాగ్యము
నివ్వటిల్ల నన్ను మన్నించితివి గాకా

(॥॥)
వేడు కౌను నీ గుణాలు వెలఁదులు పొగడితే
చూడఁ జూడ నీ రూపు సోద్యము లౌను
కూడి వున్నంత దడవు గొబ్బున సంతోసమవును
యీడ నామనసు నీపై నెంత మరిపితివో

(॥॥)
నెమ్మది నిద్రించితేను నీకలలే కందును
కొమ్మలతో నిన్నుఁ బేరుకొని మెత్తును
కమ్మర నీగురుతులు కాయ మంటితేఁ జొక్కుదు
ఇమ్ముల నీమీఁదిబత్తి యెంత నా కిచ్చితివో

(॥॥)
చిగిరించు నవ్వులు చేయి నాపైఁ జాచితే
నిగుడుఁ దమకములు నీవు చేరితే
తగు నలమేల్మంగ నింతట శ్రీ వేంకటేశ్వర
వొగి నీ రతుల కెంత వొడిగట్టించితివో

(||pallavi||)
yĕvvarigim̐ galugu nem̐ḍī bhāgyamu
nivvaḍilla nannu manniṁchidivi gāgā

(||||)
veḍu kaunu nī guṇālu vĕlam̐dulu pŏgaḍide
sūḍam̐ jūḍa nī rūbu sodyamu launu
kūḍi vunnaṁta daḍavu gŏbbuna saṁtosamavunu
yīḍa nāmanasu nībai nĕṁta maribidivo

(||||)
nĕmmadi nidriṁchidenu nīgalale kaṁdunu
kŏmmalado ninnum̐ berugŏni mĕttunu
kammara nīgurudulu kāya maṁṭidem̐ jŏkkudu
immula nīmīm̐dibatti yĕṁta nā kichchidivo

(||||)
sigiriṁchu navvulu seyi nābaim̐ jāside
niguḍum̐ damagamulu nīvu seride
tagu nalamelmaṁga niṁtaḍa śhrī veṁkaḍeśhvara
vŏgi nī radula kĕṁta vŏḍigaṭṭiṁchidivo