Yevvare neegu sari yimtulu

యెవ్వరే నీకు సరి యింతులు
Language

(॥పల్లవి॥)
యెవ్వరే నీకు సరి యింతులు
చివ్వన నలమేల్మంగ చెల్లునే నీ రంతులూ

(॥॥)
తరుణి నీ కన్నుల బిత్తరి చూపులూ
మరునికి నవియే కమ్మని తూపులూ
బిరుదుల నీ పతికె పెరరేఁపులూ
వరుసఁ జల్లితి వౌనే వలపుల రాఁపులూ

(॥॥)
పగటున నీరతి పలుకులూ
జిగి మతిఁ దగిలిన చిలుకులూ
తగిన నవ్వు దంతపు తళుకులూ
మొగి మర్మములు రేఁచే ములుకులూ

(॥॥)
పొసఁగే నీ కౌఁగిటి పొందులూ
సుసరాన మోవితేనె జుంటి విందులూ
కసిదీరని తమకపు మందులూ
కొసరి శ్రీ వేంకటేశుఁ గూడుటకే సందులూ

(||pallavi||)
yĕvvare nīgu sari yiṁtulu
sivvana nalamelmaṁga sĕllune nī raṁtulū

(||||)
taruṇi nī kannula bittari sūbulū
marunigi naviye kammani tūbulū
birudula nī padigĕ pĕrarem̐pulū
varusam̐ jallidi vaune valabula rām̐pulū

(||||)
pagaḍuna nīradi palugulū
jigi madim̐ dagilina silugulū
tagina navvu daṁtabu taḽugulū
mŏgi marmamulu rem̐se mulugulū

(||||)
pŏsam̐ge nī kaum̐giḍi pŏṁdulū
susarāna movidenĕ juṁṭi viṁdulū
kasidīrani tamagabu maṁdulū
kŏsari śhrī veṁkaḍeśhum̐ gūḍuḍage saṁdulū