యెట్టున్నదో నా భాగ్యమేమి సేతునే
(॥పల్లవి॥)
యెట్టున్నదో నా భాగ్యమేమి సేతునే
చుట్టిచుట్టి నాయాసలు సుడిగొన నిపుడు
(॥॥)
చెలిచే నా విన్నపాలు చిత్తగించి వినునొకో
తలఁపునఁ బెట్టు నొకో దయతోను
పిలిచితే వచ్చునొకో ప్రియముతో నాయింటికి
కలసునొకో నేఁడు కౌఁగిట నా విభుఁడు
(॥॥)
కడఁగి నే నంపిన కాని కందుకొనునొకో
అడుగునొకో నన్నందరిలోన
యెడయక నాకు నట్టే యిచ్చునొకో కెమ్మో
అడరి నాకుఁ గైవస మౌనొకో నా విభుఁడు
(॥॥)
తమితో నా చన్నులపై తానే చేయి చాఁచునొకో
అమరఁగ నవ్వునొకో ఆతుమఁదాను
మమకరిం చలమేలుమంగ శ్రీ వేంకటేశుఁడు
సమరతి నన్నేలె యీ జాణఁడే నా విభుఁడు
(||pallavi||)
yĕṭṭunnado nā bhāgyamemi sedune
suṭṭisuṭṭi nāyāsalu suḍigŏna nibuḍu
(||||)
sĕlise nā vinnabālu sittagiṁchi vinunŏgo
talam̐punam̐ bĕṭṭu nŏgo dayadonu
piliside vachchunŏgo priyamudo nāyiṁṭigi
kalasunŏgo nem̐ḍu kaum̐giḍa nā vibhum̐ḍu
(||||)
kaḍam̐gi ne naṁpina kāni kaṁdugŏnunŏgo
aḍugunŏgo nannaṁdarilona
yĕḍayaga nāgu naṭṭe yichchunŏgo kĕmmo
aḍari nāgum̐ gaivasa maunŏgo nā vibhum̐ḍu
(||||)
tamido nā sannulabai tāne seyi sām̐sunŏgo
amaram̐ga navvunŏgo ādumam̐dānu
mamagariṁ salamelumaṁga śhrī veṁkaḍeśhum̐ḍu
samaradi nannelĕ yī jāṇam̐ḍe nā vibhum̐ḍu