యెట్టుండినా నీవే నన్ను నీడేరించుకొంట గాక
(॥పల్లవి॥)
యెట్టుండినా నీవే నన్ను నీడేరించుకొంట గాక
మెట్టి పట్టుకొని నిన్ను మెప్పించఁ గలనా
(॥॥)
మట్టు తోడ నీతో నే మాటకు మాటాడే నంటే
జట్టి గొని నీకు నేను సరిదాననా
వొట్టుక నీ వద్ద నుండి వూడిగాలు సేసే నంటే
నెట్టన నే నంతేసికి నేరుపరినా
(॥॥)
చనవు సేసుక నీతో సారెకు నవ్వే నంటే
యెనసిన నీ చిత్త మెరుఁగుదునా
పెనఁగి పెనఁగి నీకుఁ బ్రియాలు వుట్టించే నంటే
వెనక ముందు నేనంత వివేకినా
(॥॥)
కరఁగించి నే నిన్ను కౌఁగిటఁ జొక్కించే నంటే
సరవితో నే నంత చదివితినా
నిరతి శ్రీ వేంకటేశ నీవే నన్నుఁ గూడితివి
దొరఁ జేసితివి నీవే దొడ్డదాననా.
(||pallavi||)
yĕṭṭuṁḍinā nīve nannu nīḍeriṁchugŏṁṭa gāga
mĕṭṭi paṭṭugŏni ninnu mĕppiṁcham̐ galanā
(||||)
maṭṭu toḍa nīdo ne māḍagu māḍāḍe naṁṭe
jaṭṭi gŏni nīgu nenu saridānanā
vŏṭṭuga nī vadda nuṁḍi vūḍigālu sese naṁṭe
nĕṭṭana ne naṁtesigi nerubarinā
(||||)
sanavu sesuga nīdo sārĕgu navve naṁṭe
yĕnasina nī sitta mĕrum̐gudunā
pĕnam̐gi pĕnam̐gi nīgum̐ briyālu vuṭṭiṁche naṁṭe
vĕnaga muṁdu nenaṁta viveginā
(||||)
karam̐giṁchi ne ninnu kaum̐giḍam̐ jŏkkiṁche naṁṭe
saravido ne naṁta sadividinā
niradi śhrī veṁkaḍeśha nīve nannum̐ gūḍidivi
dŏram̐ jesidivi nīve dŏḍḍadānanā.