యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను
(॥పల్లవి॥)
యెట్టు చేసినాఁ జేయి యేమీ ననఁజాల నిన్ను
ముట్టిన నా మతిలోను మోహము చెప్పితిని
(॥॥)
విరహాగ్నిఁ గాఁగి నిన్ను వెంగె మాడఁ దలఁతును
కరఁగి యంతలో నాడక మానుదును
విరుల యమ్ములు నాటి వేయఁ బూనుదు పూవుల
పరగ నా మేలుగానే భావించి వూరకుందు
(॥॥)
తమక మాఁపఁగ లేక దాకొని జంకించిఁ జూతు
మమత తో జంకించక మరి సొలతు
వుమురు వెన్నెలకుఁగా కుహింతు నిన్నుఁబైకొన
భ్రమసి నీవే నే నని భావించి వూరకుందు
(॥॥)
కోవిల కూతలకుఁగా కూచుందు నీ తొడమీఁద
కావిరిఁ గూచుండ కటు కౌఁగిలింతును
శ్రీ వేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టే
భావము లొక్కటిగానే భావించి వూరకుందు
(||pallavi||)
yĕṭṭu sesinām̐ jeyi yemī nanam̐jāla ninnu
muṭṭina nā madilonu mohamu sĕppidini
(||||)
virahāgnim̐ gām̐gi ninnu vĕṁgĕ māḍam̐ dalam̐tunu
karam̐gi yaṁtalo nāḍaga mānudunu
virula yammulu nāḍi veyam̐ būnudu pūvula
paraga nā melugāne bhāviṁchi vūraguṁdu
(||||)
tamaga mām̐pam̐ga lega dāgŏni jaṁkiṁchim̐ jūdu
mamada to jaṁkiṁchaga mari sŏladu
vumuru vĕnnĕlagum̐gā kuhiṁtu ninnum̐baigŏna
bhramasi nīve ne nani bhāviṁchi vūraguṁdu
(||||)
kovila kūdalagum̐gā kūsuṁdu nī tŏḍamīm̐da
kāvirim̐ gūsuṁḍa kaḍu kaum̐giliṁtunu
śhrī veṁkaḍeśha nannum̐ jegŏni kūḍidi viṭṭe
bhāvamu lŏkkaḍigāne bhāviṁchi vūraguṁdu